ముందుగా తాజా పండ్లను తీసుకుని, వాటిని నీళ్లతో శుభ్రంగా కడగాలి. రసం తీసే జ్యూసర్ మరీ వేడిగా ఉండకూడదు. మిక్సర్ అధిక ఉష్ణోగ్రత పండ్లు, కూరగాయల పోషక విలువలను నాశనం చేస్తుంది. పండ్లు లేదా కూరగాయల రసం చేయడానికి ముందు, వాటి నుంచి విత్తనాలను తొలగించుకోవాలి. లేదంటే రసంలో కలిసిపోయి చేదుగా మారుతుంది.