మిస్టర్ అండ్ మిసెస్ మహి స్పోర్ట్స్ డ్రామా. రూహీ సినిమా తర్వాత రాజ్‌కుమార్, జాన్వీ కలిసి నటిస్తున్న మూవీ ఇది. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సినిమాను తెరకెక్కించిన శరణ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మేలోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ''నేను బ్యాట్ పట్టుకుని ఇవాళ్టికి రెండేళ్లయింది'' అయింది అంటూ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ పూర్తయిన సందర్భంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు జాన్వీ కపూర్.