Buffet Side Effects: బఫెట్ భోజనం చేస్తున్నారా.? డేంజర్ అంటున్న నిపుణులు..
సాధారణంగా బఫెట్ లంచ్‌లు ఖర్చుతో కూడుకున్నవి. ఒకటికి మించి వెరైటీలు ఉండడంతో వీటి ఖరీదు ఎక్కువగా ఉంటాయి. సాధారణ లంచ్‌తో పోల్చితే బఫెట్ మూడు రెట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఎలాగో ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నాం కదా అనే కారణంతో ప్రజలు అవసరానికి మించి తింటున్నారని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. చెల్లిస్తున్న మొత్తానికి లాభం చేద్దామనట్లు అవసరానికి మించి తినేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం బఫెట్ భోజనం ట్రెండ్ నడుస్తోంది. ఎక్కువ మంది ఇలాంటి భోజనాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్ లిమిటెడ్ ఫుడ్‌తో పాటు రకరకాల ఆహార పదార్థాలు ఉండడం భోజన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. అయితే బఫెట్ లంచ్ లేదా డిన్నర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? నిపుణులు ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ బఫెట్ భోజనానికి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే…
సాధారణంగా బఫెట్ లంచ్‌లు ఖర్చుతో కూడుకున్నవి. ఒకటికి మించి వెరైటీలు ఉండడంతో వీటి ఖరీదు ఎక్కువగా ఉంటాయి. సాధారణ లంచ్‌తో పోల్చితే బఫెట్ మూడు రెట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఎలాగో ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నాం కదా అనే కారణంతో ప్రజలు అవసరానికి మించి తింటున్నారని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. చెల్లిస్తున్న మొత్తానికి లాభం చేద్దామనట్లు అవసరానికి మించి తినేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
అంతేకాకుండా బఫెట్ భోజనం తయారీలో ఉపయోగించే వస్తువుల నాణ్యత విషయంలోనూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5స్టార్ లాంట్ బడా హోటల్స్‌లో కూడా వంటల్లో చక్కెర, ఉప్పు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే నాణ్యత లేని నూనెలను కూడా ఉపయోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హోటల్స్‌లో వంటల్లో ఉపయోగించే వస్తువులను రిఫ్రిజిరేటర్స్‌లో ఎక్కువకాలం నిల్వ ఉంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
బఫెట్ భోజనం తయారీలో అధిక కేలరీలు ఉండే ఆహార పదార్థలను ఉపయోగిస్తుండడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెలకొకసారి ఇలా బఫెట్ భోజనం చేసినా.. బరువు పెరగడానికి కారణంగా నిలుస్తోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు బఫెట్ భోజనాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హోటల్స్‌లో భోజనాలు చేయాల్సి వచ్చినా.. బఫెట్‌కు బుదులుగా సూప్ లేదా స్టార్టర్స్ వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..