Kalakand Sweet: ఈ దీపావళికి ఇంట్లోనే కలాకండ్ స్వీట్ తయారీ.. చాలా సింపుల్‌గా..
స్వీట్స్ అనగానే వెంటనే దుకాణాల్లోకి వెళ్లి కొనుగోలు చేయడమే అనుకుంటాం. అయితే ఇంట్లోనే ఎంచక్కా స్వీట్స్ తయారు చేసుకుంటే భలే ఉంటుంది కదూ! స్వీట్ షాపుల్లో నాణ్యత ఉన్న వస్తువులను ఉపయోగిస్తారో లేదో అనుమానాలు ఉంటాయి. ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే లభించే వస్తువులతో కలాకండ్ స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ కలాకండ్ స్వీట్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఇందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..

దీపావళి పండుగను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ వేడుకలకు ఇంకా రెండు రోజులే ఉండడంతో ఇప్పటికే అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి అనగానే కొత్త దుస్తులు, ఇంటి ఆలంకరణ, టపాసులతో పాటు గుర్తొచ్చే వాటిలో స్వీట్స్ కూడా ప్రధానమైనవి. పండగ వచ్చిందంటే స్వీట్స్ కచ్చితంగా ఉండాల్సిందే.
ఇక స్వీట్స్ అనగానే వెంటనే దుకాణాల్లోకి వెళ్లి కొనుగోలు చేయడమే అనుకుంటాం. అయితే ఇంట్లోనే ఎంచక్కా స్వీట్స్ తయారు చేసుకుంటే భలే ఉంటుంది కదూ! స్వీట్ షాపుల్లో నాణ్యత ఉన్న వస్తువులను ఉపయోగిస్తారో లేదో అనుమానాలు ఉంటాయి. ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే లభించే వస్తువులతో కలాకండ్ స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ కలాకండ్ స్వీట్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? ఇందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..
కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..
కలాకండ్ తయారు చేయడానికి 250 గ్రాముల జున్ను, సరిపడ చక్కెర, 1 టేబుల్ స్పూన్ పాలపొడి, అర టీస్పూన్ యాలకుల పొడి అవసరపడుతుంది. అలంకకరణ కోసం కాస్త తరిగిన పిస్తా, గులాబీ ఆకులు కావాలి. ఇక తయారీ విషయానికొస్తే.. ముందుగా జున్నును తీసుకోవాలి. ఒకవేళ జున్ను లభించకపోతే పాలను విరగొట్టడం ద్వారా జున్ను తయారు చేసుకోవచ్చు.
అనంతరం గ్యాస్ స్టవ్ మీద పాన్ ఉంచాలి. అందులో చక్కెర వేసి, జున్నును వేయాలి. జున్ను, చక్కెర బాగా కలిసేలా లపాలి. అనంతరం అందులోనే కొంచెం మిల్క్ పౌడర్‌ను వేసి కలుపుతూ ఉండాలి. మాడి పోకుండా చూసుకోవాలి. ఒకవేళ మంట ఎక్కువై మాడితే స్వీట్ రుచి మారిపోతుంది. అనంతరం అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో వేసి పరచాలి. అనంతరం గులాబీ ఆకులు, పిస్తా తురుముతో అలంకరించుకోవాలి. చివరిగా ముక్కలుగా కట్ చేస్తే చాలు ఇంట్లోనే సింపుల్‌గా కలాకండ్ స్వీట్ తయారైపోతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




