AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Drinks for Hair Growth: ఉదయాన్నే ఖాళీకడుపుతో ఈ పానియం తాగితే.. పట్టుకుచ్చులాంటి కురులు మీ సొంతం

ఇటీవలి కాలంలో అన్ని వయసుల వారు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు కారణం అనేకం. ముఖ్యంగా చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ జుట్టు రాలడం సమస్యను వదిలించుకోవడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చాలా మంది వివిధ హెయిర్ మాస్క్‌లు, రకరకాల నూనెలు ఆశ్రయిస్తుంటారు. దీనితోపాటు జుట్టు ఆరోగ్యానికి అంతర్గత పోషకాలు కూడా అంతే ముఖ్యమైనవి..

Morning Drinks for Hair Growth: ఉదయాన్నే ఖాళీకడుపుతో ఈ పానియం తాగితే.. పట్టుకుచ్చులాంటి కురులు మీ సొంతం
Healthy Drinks To Prevent Hair Loss
Srilakshmi C
|

Updated on: Dec 28, 2025 | 1:39 PM

Share

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారింది. మీకూ జుట్టు రాలడం సమస్య ఉంటే వంటగదిలో సులభంగా లభించే మెంతులతో జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల తలలోని చర్మాన్ని లోపలి నుంచి నిర్విషీకరణ చేయడమే కాకుండా జుట్టు మూలాలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఇలాంటి మరికొన్ని సహజ పానియాలు జుట్టు సంరక్షణకు తోల్పడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మెంతి నీళ్లు

మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఓ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంతోపాటు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది.

గూస్బెర్రీ పానీయం

గూస్బెర్రీల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎండిన గూస్బెర్రీలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం ఆ నీటిని తాగడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కొత్తిమీర నీళ్లు

కొత్తిమీర ఆకులలో ఐరన్‌, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకును నీటిలో మరిగించి వడకట్టి, ప్రతిరోజూ ఉదయం వేళల్లో తాగాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తలకు పోషణను అందిస్తుంది.

అలోవెరా నీళ్లు

అలోవెరాలో జుట్టు కుదుళ్లను పునరుజ్జీవింపజేసే ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తులసి నీళ్లు

తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించి ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి.

దాల్చిన చెక్క నీళ్లు

దాల్చిన చెక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది పోషకాలు తలకు చేరడానికి సహాయపడుతుంది. కాబట్టి దాల్చిన చెక్క ముక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి. ఈ పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సహజంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.