Dry Lips: ఈ సీజన్‌లో పెదాలు పగులి చిరాకుగా అనిపిస్తుందా.. ఇలా చేయండి!
చలి కాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు మొదలవుతాయి. కేవలం చర్మం మాత్రమే కాకుండా పెదాలు కూడా పగులుతూ ఉంటాయి. పెదాలు పగలడం వల్ల ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. ఇలా చాలా ఇబ్బందిగా, చికాకుగా ఉంటుంది. ఈ టిప్స్ పాటించారంటే లిప్స్ మళ్లీ అందగా మారతాయి..
ఇతర సీజన్ల కంటే చలి కాలంలే ఆడవారికి అస్సలు ఇష్టం ఉండదు. చలి కాలంలో చర్మం, పెదాలు పగులుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చలి కారణంగా స్కిన్ పగిలి తెల్ల తెల్లగా కనిపిస్తుంది. చేతులు, కాళ్లపై గీతలు ఏర్పడతాయి. పెదాలు కూడా పగులుతాయి. పొరలు పొరలు ఊడి వస్తాయి. ఈ క్రమంలో స్కిన్ పరంగా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. బయట వాటిని కొనే వాటి కంటే ఇంట్లో రెమిడీస్ కూడా ఫాలో చేయవచ్చు. ఇవి ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. బయట కొనడం కంటే ఇంట్లో రెమిడీలు ఫాలో చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెదాలు మళ్లీ మెత్తగా, మృదువుగా మారతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుుడు చూద్దాం.
నూనె రాయండి:
చలి కాలం మొదలవగానే ముందు పెదాలపై శ్రద్ధ వహించాలి. రాత్రి పడుకునే ముందు పెదాలపై కొబ్బరి నూనె రాస్తూ ఉండాలి. కొబ్బరి నూనె రాయడం వల్ల పెదాలు మెత్తగా మారతాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి.. ఆరోగ్యంగా మెరుస్తాయి.
వెన్న:
పెదాలు బాగా పగిలి పొరలు ఊడేవారు వెన్న రాయవచ్చు. వెన్న రాయడం వల్ల పెదాలు మృదువుగా, మెత్తగా మారతాయి. చక్కగా మెరుస్తాయి. వెన్న చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం పెదాలపై వెన్న రాసి కాసేపు మర్దనా చేసి.. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. నెయ్యి కూడా పెదాలపై రాయడం వల్ల మెత్తబడతాయి.
తేనె:
పెదాలు పగిలి ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. అలాంటి సమయంలో తేనె చక్కగా పని చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి తేనె రాస్తే త్వరగా తేమగా మారతాయి. తేనె రాయడం వల్ల పెదాలు కోమలంగా తయారవుతాయి.
పచ్చి పాలు:
పెదాలు మెత్తగా, మృదువుగా మెరుస్తూ ఉండాలంటే.. పచ్చి పాలు రాస్తూ ఉండండి. కాటన్ సహాయంతో పెదాలపై పాలను రాస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తే.. పెదాలు అస్సలు పగలవు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.