Phool Makhana Laddu: ఫూల్ మఖానాతో లడ్డూ.. పిల్లలకు బెస్ట్ రెసిపీ..

ఫూల్ మఖానా అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. ఫూల్ మఖానా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఫూల్ మఖానాలో కేవలం వంటలే కాకుండా స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో పోషకాలు నిండిన లడ్డూలు తయారు చేసి పిల్లలకు ఇస్తే బలంగా ఉంటారు..

Phool Makhana Laddu: ఫూల్ మఖానాతో లడ్డూ.. పిల్లలకు బెస్ట్ రెసిపీ..
Phool Makhana Laddu
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2024 | 10:15 PM

పిల్లలకు ఏదన్నా ఆరోగ్యంగా చేసి పెట్టాలని తల్లులకు ఉంటుంది. వెరైటీగా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ డైలీ పెట్టేవి కాకుండా వేరే స్నాక్స్ కావాలని అంటారు. ఫూల్ మఖానా తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫూల్ మఖానాతో కూడా ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖానాతో వంటలే కాకుండా లడ్డూ కూడా చేసుకోవచ్చు. దీంతో తయారు చేసే లడ్డూ ఒక్కటి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, బెల్లం కలిపి చేస్తారు కాబట్టి.. శరీరానికి కావాల్సిన పోషకాలు మొత్తం లభిస్తాయి. మరి ఈ ఫూల్ మఖానా లడ్డూ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫూల్ మఖానాకు కావాల్సిన పదార్థాలు:

ఫూల్ మఖానా, బెల్లం పొడి లేదా పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కొబ్బరి తురుము, నువ్వులు, యాలకుల పొడి.

ఫూల్ మఖానా తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఫూల్ మఖానా వేసి.. దోరగా వేయించాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును కూడా అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేయిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫూల్ మఖానా, డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీలో వేసి పొడిలా చేసి పక్కన పెట్టండి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్‌లోనే బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు కూడా వేసి పాకం తీయాలి. ఇప్పుడు ఈ పాకంలో ఫూల్ మఖానా పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. నువ్వులు, యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి. కాస్త చల్లారిన తర్వాత చేతి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా తయారైన వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసి పెడితే నెల రోజుల వరకూ నిల్వ ఉంటాయి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!