Ridge Gourd Benefits: బీరకాయతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు కూడా తెలీదు..
బీరకాయ కూరగాయల్లో ఒకటి. చాలా మంది బీరకాయను ఇష్ట పడి మీర తింటూంటారు. కానీ ఇంకొందరికి మాత్రం అస్సలు నచ్చదు. కానీ ఒక్కసారి ఈ ఆర్టికల్ చదివి.. బీరకాయ గురించి తెలుసుకేంటు ఖచ్చితంగా తింటారు. బీరకాయతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీరకాయను ఎలాంటి సమస్యతో ఉన్నావైరనా తినొచ్చు. బాలింతలకు, సర్జరీలు అయిన వాళ్లకు, శరీరం ధృఢంగా ఉండాలంటే బీరకాయనే ముందు పడెతారు. ఇందులో నీటి శాతం, ఫైబరే కాకుండా ఇంకా ఎన్నో పోషకాలు..

బీరకాయ కూరగాయల్లో ఒకటి. చాలా మంది బీరకాయను ఇష్ట పడి మీర తింటూంటారు. కానీ ఇంకొందరికి మాత్రం అస్సలు నచ్చదు. కానీ ఒక్కసారి ఈ ఆర్టికల్ చదివి.. బీరకాయ గురించి తెలుసుకేంటు ఖచ్చితంగా తింటారు. బీరకాయతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీరకాయను ఎలాంటి సమస్యతో ఉన్నావైరనా తినొచ్చు. బాలింతలకు, సర్జరీలు అయిన వాళ్లకు, శరీరం ధృఢంగా ఉండాలంటే బీరకాయనే ముందు పడెతారు. ఇందులో నీటి శాతం, ఫైబరే కాకుండా ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం వచ్చేది సమ్మర్ సీజన్. బీరకాయ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూసేయండి.
బీరకాయలో పోషకాలు:
బీరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్, కాపర్, థైమీన్, పిండి పదార్థాలు, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి.
రక్తహీనత సమస్య తగ్గుతుంది:
తరచూ బీరకాయ తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. బీరకాయలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది తీసుకుంటే ఐరన్ లోపం కారణం చేత వచ్చే రక్త హీనత గ్గుతుంది. అలాగే బీరకాయలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. నొప్పులు, అలసట నుంచి కూడా దూరం చేస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉంటే.. వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో బీరకాయ సహాయ పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు, రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా బాడీలో ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. బీరకాయ తింటే తక్షణ శక్తి లభిస్తుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది:
తరచూ బీరకాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది మెరుగ్గా పని చేస్తుంది. ఎందుకంటే బీరకాయలో తగినంత ఫైబర్ ఉంటుంది. బీరకాయ చాలా త్వరగా అరిగిపోతుంది. దీని వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవు. అదే విధంగా పేగుల కదలికను, జీర్ణ క్రియను కూడా మెరుగు పరుస్తుంది. చిన్న పిల్లలకు మలబద్ధకం సమస్య ఉంటే.. బీరకాయ పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
లివర్ ఆరోగ్యంగా ఉంటుంది:
బీర కాయ తినడం వల్ల లివర్ కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలు, జీర్ణం కాని ఆహార కణాలను తొలగించడంలో బీరకాయ సహాయ పడుతుంది. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.








