Gingivitis: చిగుళ్ల వాపుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇకపై ఆ సమస్య ఉండదు!
అప్పుడప్పుడూ దంత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇందులోనే చిగుళ్ల వాపు కూడా ఒకటి. చిగుళ్ల వాపు వచ్చిందంటే.. నొప్పి, రక్తం కారటం వంటి సమస్యలు కనిపస్తాయి. చిగుళ్లు వాయడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైరల్ ఇన్ ఫెక్షన్స్, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, పోషకాహార లోపం వంటి, ఇతర సమస్యల వల్ల కూడా చిగుళ్ల వాపు వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. ఇన్ ఫెక్షన్ అనేది బాగా పెరుగుతుంది. క్రమంగా ఎముక కూడా ఇన్ ఫెక్షన్‌కు గురవుతుంది. చిగుళ్ల వాపును తగ్గించడానికి..

అప్పుడప్పుడూ దంత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇందులోనే చిగుళ్ల వాపు కూడా ఒకటి. చిగుళ్ల వాపు వచ్చిందంటే.. నొప్పి, రక్తం కారటం వంటి సమస్యలు కనిపస్తాయి. చిగుళ్లు వాయడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైరల్ ఇన్ ఫెక్షన్స్, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, పోషకాహార లోపం వంటి, ఇతర సమస్యల వల్ల కూడా చిగుళ్ల వాపు వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. ఇన్ ఫెక్షన్ అనేది బాగా పెరుగుతుంది. క్రమంగా ఎముక కూడా ఇన్ ఫెక్షన్‌కు గురవుతుంది. చిగుళ్ల వాపును తగ్గించడానికి.. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఇంటి చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి. మరి ఆ హోమ్ మేడ్ రెమిడీస్ ఏంటో చూసేయండి.
ఉప్పు నీరు పుక్కిలించండి:
చిగుళ్లు వాసినప్పుడు.. ఉప్పు నీరును పుక్కలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పును కలిపి.. నోటిలో వేసుకుని బాగా పుక్కలించండి. ఉప్పు నీరు.. నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేసి.. చిగుళ్ల వాపును తగ్గించడమే కాకుండా నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
ఆయిల్ పుల్లింగ్:
తరచూ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆయిల్ పుల్లింగ్ చేస్తే.. నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియా, చిగుళ్ల సమస్యలు, పంటి సమస్యలు, నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆయిల్ పుల్లింగ్ చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఆయిల్ పుల్లింగ్‌కు కొబ్బరి నూనె చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటిని హెల్దీగా ఉంచుతుంది.
పసుపు:
చిగుళ్ల వాపు సమస్య వేధిస్తే.. పసుపుతో కూడా ఉపశమనం పొందవచ్చు. కొద్దిగా పసుపు తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లా కలపాలి. ఈ పేస్ట్‌తో చిగుళ్ల వాపు ఉన్న ప్రాంతంలో రాయలి. ఇలా కొద్ది సేపు ఉంచాలి. ఆ తర్వాత వేడి నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తే.. మంచి ఉపశమనం లభిస్తుంది.
లవంగాలు:
లవంగాల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి. లవంగాల పొడిని.. చిగుళ్ల వాపు ఉన్న చోట అద్దాలి. ఆ తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చిగుళ్ల వాపు తగ్గుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.








