హైదరాబాద్‌లో టీవీ9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
టీవీ9 & క్యాబ్ ఎడ్యుకేషన్ expo ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీధర్ బాబు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్యుకేషన్ ఎక్స్పో కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు..

హైదరాబాద్, మే 22: టీవీ9 & క్యాబ్ ఎడ్యుకేషన్ expo కార్యక్రమం శుక్రవారం (మే 22) ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీధర్ బాబు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్యుకేషన్ ఎక్స్పో కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు.
కాగా దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ ఎక్స్ పోగా టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా 100కు పైగా కాలేజీలు టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పోలో భాగమయ్యాయి. దేశంలోనే పేరు పొందిన deemed యూనివర్సిటీ లు పాల్గొనే ఏకైక ఎక్స్పోగా టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ ఎక్స్ పో నిలిచింది. ఇంజనీరింగ్ మెడికల్ రోబోటిక్ ఇలా అన్ని విభాగాల్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు బెస్ట్ కాలేజీని ఎంచుకునేందుకు ఏకైక వేదిక టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పో.
ఈ టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 మే 22 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరగనుంది. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిపుణుల చేత కెరీర్ గైడెన్స్ పొందొచ్చు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల వరకు ఈ కార్యక్రమం పలు కెరీర్ మార్గాలను కవర్ చేస్తుంది. ఎంట్రీ కూడా పూర్తిగా ఉచితం. హదరాబాద్ తోపాటు ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026ను బెంగళూరు, అహ్మదాబాద్, హుబ్బళ్లి, వడోదర, రాజ్‌కోట్, సూరత్, శివమొగ్గ, పూణే, హైదరాబాద్, విజయవాడ, కోల్‌కతా, విశాఖపట్నం సహా 12 ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు.




