AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ అసాధ్యురాలు.. స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..!

స్నానం చేయనందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే బావిలో దూకగానే ప్రాణభయంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత..

బాబోయ్ అసాధ్యురాలు.. స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..!
Representative Image
Naresh Gollana
| Edited By: |

Updated on: May 25, 2026 | 3:39 PM

Share

ఆసిఫాబాద్, మే 21: స్నానం చేయకుండా అదే పనిగా ఫోన్‌ చూస్తున్న కూతురిని ఓ తల్లి మందలించింది. అంతే మనస్తాపానికి గురై ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో సమాయానికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Mysterious: గంపెడు ఆశతో చేపల కోసం వెళ్తే.. జాలరి వలలో చిక్కింది చూసి షాక్‌!

ఆసిఫాబాద్‌ పట్టణంలోని సందీప్‌నగర్‌లో ఓ యువతి ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఈ ఏడాది సెకండ్‌ ఇయర్‌లోకి వెళ్లబోతుంది. అయితే బుధవారం ఇంట్లో కూర్చుని ఫోన్‌ చూస్తున్న ఆ యువతిని స్నానం చేయమని కుటుంబ సభ్యులు కాస్త గట్టిగా మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. కోపంతో పక్క వీధి బజార్‌వాడిలోని బావి వద్దకు పరుగెత్తుకు వెళ్లి అందులో దూకింది. అయితే ప్రాణ భయంతో బాలిక నీటిలో కొట్టుకుంటూ కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు వెంటనే 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

స్పందించిన ఎస్‌హెచ్‌వో పోలీసులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి తరలించారు. ఫైర్‌ ఫైటర్‌ నరేష్, ఫైర్‌మెన్‌ రాము, చోదకుడు ప్రవీణ్‌కుమార్‌లు తాడు సాయంతో బావిలో దిగి బాలికకు రక్షణ జాకెట్‌ తొడిగి బయటకు లాగారు. సకాలంలో స్పందించి బాలిక ప్రాణాలు కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని కాలనీ ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించారు. చిన్న విషయానికే బావిలో దూకిన బాలికకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనలో బాలిక కాలికి గాయమవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Follow Us
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి