AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JoSAA Counselling 2026: మరో వారంలో జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు

JEE అడ్వాన్స్‌డ్ 2026 తుది ఆన్సర్ కీ ఈ నెల 25న విడుదల కానుంది. ఇక ఫలితాలు జూన్ 1న వెల్లడిస్తారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే JoSAA కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఈ క్రమంలో గతేడాది జోసా కౌన్సెలింగ్ ఎలా జరిగింది? ఏ తేదీన ఏయే విధంగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

JoSAA Counselling 2026: మరో వారంలో జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు
JoSAA Counselling
Srilakshmi C
|

Updated on: May 22, 2026 | 12:03 PM

Share

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష ఫలితాలు జూన్‌ 1న వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) త్వరలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. IIT, NIT, IIEST, IIIT ఇతర GFTIలలో JoSAA 2026 ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుంది. అందుకు అభ్యర్థులందరూ అధికారిక JoSAA ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

ఈ సంస్థలు అందించే అన్ని అకడమిక్ ప్రోగ్రామ్‌ల అడ్మిషన్లు JoSSA ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIEST), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలచే నడిచే ఇతర విద్యా సంస్థలకు కూడా JEE మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే జూన్ 3 నుంచి JoSAA రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

గత ఏడాది జేఈఈ మెయిన్ ర్యాంకును ఏప్రిల్ 17న ప్రకటించారు. అనతరం జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించారు. ఇక గత ఏడాది JoSAA కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు జూన్ 3 నుంచి ప్రారంభమైనాయి. జూన్ 14న సీట్ల కేటాయింపు మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించింది. అభ్యర్థులు జూన్ 14 నుండి 22 వరకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసింది. జూన్ 25న రెండవ విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ప్రకటించింది. ఐఐటీల తుది రౌండ్ (6వ రౌండ్) సీట్ల కేటాయింపు ఫలితం జూలై 16న విడుదలైంది. కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించడమైనది.

Follow Us