AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అతిపెద్ద టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026.. ఇవాళ్టి నుంచే ప్రారంభం

హైదరాబాద్‌, మే 22: టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మే 22 నుంచి మే 24, 2026 వరకు ఈ ఎడ్యుకేఉషన్‌ ఎక్స్‌పో జరగనుంది. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ మెగా ఎక్స్‌పోకు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఉన్నత విద్యా అవకాశాలపై సమగ్ర అవగాహనకు, సరైన కెరీర్ నిర్ణయాలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేయనున్నారు..

హైదరాబాద్‌లో అతిపెద్ద టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026.. ఇవాళ్టి నుంచే ప్రారంభం
TV9 & KAB Education Expo at hyderabad
Srilakshmi C
|

Updated on: May 22, 2026 | 11:36 AM

Share

Tv9 & క్యాబ్ ఎడ్యుకేషన్ expo ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్యుకేషన్ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. టీవీ9 నెట్‌వర్క్ జాతీయ విద్యా కార్యక్రమాలలో భాగంగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026ను బెంగళూరు, అహ్మదాబాద్, హుబ్బళ్లి, వడోదర, రాజ్‌కోట్, సూరత్, శివమొగ్గ, పూణే, హైదరాబాద్, విజయవాడ, కోల్‌కతా, విశాఖపట్నం సహా 12 ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి కేఏబీ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ మద్దతు ఇస్తోంది. ఇది విద్యార్థులకు కౌన్సెలింగ్, అడ్మిషన్ మార్గదర్శకత్వం అందించడంలో, సరైన విద్యా, వృత్తి మార్గాలను ఎంచుకోవడంలో అనుభవజ్ఞులైన విద్యా, కెరీర్ మార్గదర్శక సంస్థగా గుర్తింపు పొందింది. ఈ మూడు రోజుల కార్యక్రమంలో నగరాల వారీగా పూర్తి షెడ్యూల్, పాల్గొనేవారి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 పూర్తి షెడ్యూల్ ఇదే

ఈ ఎక్స్‌పో విద్యార్థులకు అనేక రకాల ఉన్నత విద్యా కోర్సుల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల వరకు ఈ కార్యక్రమం పలు కెరీర్ మార్గాలను కవర్ చేస్తుంది. అలాగే విదేశాలలో చదువుకోవాలని ఆకాంక్షించే విద్యార్థులు కూడా ఈ ఎక్స్‌పోలో గెడైన్స్ పొందొచ్చు. ఇది పూర్తి ఉచిత నిపుణుల కౌన్సెలింగ్. విద్యార్థులు తమ ఆసక్తులు, విద్యా నేపథ్యం ఆధారంగా తగిన కోర్సులను ఎంచుకోవడంపై వృత్తిపరమైన సలహాను ఉచితంగా పొందవచ్చు. ఈ ఎక్స్‌పోలో TS EAPCET, ECET, JoSAA, NEET వంటి ప్రధాన ప్రవేశ పరీక్షల వెబ్ కౌన్సెలింగ్ గైడెన్స్‌ కూడా అందిస్తారు. విద్యార్థులు తమ స్కోర్‌ ఆధారంగా ఏయే కాలేజీల్లో సీట్లు పొందొచ్చో, వారికి ఏయే అవకాశాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి అసహాయపడుతుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటు ఈ ఎక్స్‌పోకు హాజరు కావచ్చు. పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద తల్లిదండ్రులకు ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుంది. తద్వారా వారు ప్రవేశ విధానాలు, కోర్సుల నిర్మాణం, కెరీర్ అవకాశాలపై స్పష్టత పొందవచ్చు. తమ పిల్లల ఎడ్యుకేషన్‌ జర్నీ గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది.

ఉన్నత విద్యాల కోసం ప్లాన్ చేసుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈ ఎక్స్‌పో ఎంతో కీలకం కానుంది. అగ్రశ్రేణి విద్యాసంస్థలు, నిపుణుల మార్గదర్శకత్వం వంటి పూర్తి సమాచారం అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఫలితంగా TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 వేలాది మంది యువ ఆశావహుల కెరీర్‌లను తీర్చిదిద్దడంలో తోడ్పతుంది. TV9, KAB ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఎక్స్‌పోగా కాకుండా, ఇక్కడికి వచ్చే ప్రతి విద్యార్థి కెరీర్‌ను మార్చే గైడ్‌గా వ్యవహరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎక్స్‌పోకు ఎవరైనా హాజరుకావచ్చు. ప్రవేశం పూర్తిగా ఉచితం.

వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్ కార్యక్రమం షెడ్యూల్: మే 23 నుంచి 25, 2026. సమయం: ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు.

Follow Us