OTT Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. కడుపుబ్బా నవ్వించే యాక్షన్ ఎంటర్ టైనర్
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. శ్రీ విష్ణు, జేడీ చక్రవర్తి లాంటి క్రేజీ హీరోలు ఉండడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టిందీ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పుడీ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అందులో చాలా సినిమాలు ముందే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తాయి. మరికొన్ని సడెన్ గా, సైలెంట్ గా ఓటీటీల్లో దర్శనమిస్తుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండానే సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అదే డైరెక్టర్ కమ్ హీరో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన గాయపడ్డ సింహం. ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. కామెడీ మోతాదు ఎక్కువగా ఉండడంతో ఆడియెన్స్ బాగానే నవ్వుకున్నారు. ఇప్పుడీ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది.
గాయపడ్డ సింహం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మే22) అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించారు. అలాగే ఎంటర్ టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు ఓ కీలక పాత్ర పోషించారు. సీనియర్ హీరో జేడీ చక్రవర్తి మరో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నారు. వీరితో పాటు విష్ణు ఓయ్, ఝాన్సీ, హర్షవర్థన్, శుభలేఖ సుధాకర్, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. స్వీకర్ అగస్తీ సంగీతం సమకూర్చారు. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం
Gaayapadda Simham – Now Streaming on #primevideo in #telugu, #tamil, #hindi & #malayalam#GaayapaddaSimham pic.twitter.com/phbpzW814O
— Telugu Film Fusion (@Telugu_Fusion) May 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




