AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life without Onions: ఒక నెల రోజుల పాటు ఉల్లిపాయలు తినకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా వంటలో ఉపయోగించే కూరగాయలలో ఉల్లిపాయ ఒకటి. బర్గర్‌ నుంచి స్టైర్ ఫ్రైస్ వరకు ప్రతిదానిలో ఉల్లిని జోడిస్తుంటారు. కొందరికి దీని రుచి నచ్చదు. ఉల్లిపాయలను పచ్చిగా తింటే నోటి దుర్వాసన రావడానికి కూడా ఇదే కారణం. అయితే ఉల్లి ఒక నెల రోజులపాటు అస్సలు తినకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా అలోచించారా? నిపుణుల ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Life without Onions: ఒక నెల రోజుల పాటు ఉల్లిపాయలు తినకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Life Without Onions
Srilakshmi C
|

Updated on: Apr 29, 2024 | 7:29 PM

Share

ప్రపంచవ్యాప్తంగా వంటలో ఉపయోగించే కూరగాయలలో ఉల్లిపాయ ఒకటి. బర్గర్‌ నుంచి స్టైర్ ఫ్రైస్ వరకు ప్రతిదానిలో ఉల్లిని జోడిస్తుంటారు. కొందరికి దీని రుచి నచ్చదు. ఉల్లిపాయలను పచ్చిగా తింటే నోటి దుర్వాసన రావడానికి కూడా ఇదే కారణం. అయితే ఉల్లి ఒక నెల రోజులపాటు అస్సలు తినకపోతే మన శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా అలోచించారా? నిపుణుల ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

ఉల్లి.. పోషకాహార పవర్‌హౌస్

ఉల్లిపాయలు కేవలం ఆహారానికి అదనపు రుచిని అందించేవి మాత్రమే కాదు. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి6, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల, ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి ఆహారంలో ఉల్లిపాయలు తప్పక తీసుకోవాలి. అంతేకాకుండా ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇన్ని లాభాలు ఉన్న ఉల్లిపాయలు తినకపోవడం వల్ల శరీరంపై కలిగే ప్రభావాలు ఏంటంటే..

ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఇది చాలా అవసరం. వీటిని ఆహారంలో తొలగించడం వల్ల ఫైబర్ తీసుకోవడం తాత్కాలికంగా తగ్గుతుంది. ఫలితంగా మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఉల్లిపాయల్లో అల్లిసిన్‌, క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకోకపోతే శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పెరిగుతాయి. ఆక్సీకరణ ఒత్తిడికి కూడా మరింత గురి అవుతుంది. ఇది కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఆహారం నుంచి వీటిని తొలగించడం వలన ఆ పోషకాల లోపం శరీరంలో తలెత్తుతుంది. ముఖ్యంగా వీటిల్లోని మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలతో విటమిన్లు సి, బి6 ఫోలేట్ లోపం తలెత్తుతుంది. ఇది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారి తీస్తుంది. అలసట, రక్తం గడ్డకట్టడం, ఎర్ర రక్త కణాల తగ్గుదల వంటి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అందుకే రోజు వారి ఆహారంలో ఉల్లిపాయలు తప్పక తీసుకోవాలి. వాటిని పూర్తిగా మానేయడం వలన శరీరానికి విలువైన పోషకాలు అందకుండా పోతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.