Big News Big Debate: తెలంగాణలో రచ్చ రాజేసిన ఫేక్‌ వీడియో కేసు

అమిత్ షా ఫేక్ వీడియోను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో వీడియోను పోస్ట్‌ చేసిన టీపీసీసీకి నోటీసులు ఇచ్చారు అధికారులు. పీసీసీ ప్రెసిడెంట్‌ హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి మే 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Big News Big Debate: తెలంగాణలో రచ్చ రాజేసిన ఫేక్‌ వీడియో కేసు
Big News Big Debate
Follow us

|

Updated on: Apr 29, 2024 | 7:08 PM

ఓ వైపు రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్‌ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్‌ అవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ అమిత్‌ షా అన్నట్లుగా వైరల్ అయిన వీడియో‌ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇటీవల సిద్దిపేటలో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే రిజర్వేషన్లు చెందాలన్నారు. అయితే అందులో ముస్లిం రిజర్వేషన్లు అనే పదాన్ని తొలగించి… దాని స్థానంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పదాలను చేర్చారు. పక్కాగా ఎడిటింగ్‌ చేసి వీడియో ఇది.

అమిత్ షా ఫేక్ వీడియోను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో వీడియోను పోస్ట్‌ చేసిన టీపీసీసీకి నోటీసులు ఇచ్చారు అధికారులు. పీసీసీ ప్రెసిడెంట్‌ హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి మే 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అటు అమిత్‌షా ఫేక్‌ వీడియో కేసులో అసోంకు చెందిన రితోమ్‌సింగ్‌ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

బీజేపీపై కుట్రలో భాగంగానే ఫేక్‌ వీడియో సృష్టించి వైరల్‌ చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. హోంమంత్రి మాటలను మార్ఫింగ్‌ చేయడం అతిపెద్ద నేరమని, దేశద్రోహమన్నారు మంత్రి కిషన్‌ రెడ్డి. అయితే ఎన్నికల ముందు కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం బీజేపీకి అలవాటేనని కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..