AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Deeksha: అయోధ్య రామ మందిరం కోసం దశాబ్దాలుగా దీక్ష.. చివరికి ఇలా..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేదీ కోట్లాది మంది హిందువుల కల. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి అయోధ్య కేసు సాగగా.. రాముడికి గుడి కట్టాలని హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేపట్టారు. ఎందరో త్యాగాల ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ట పూర్తి చేసుకుంది.

Ayodhya Deeksha: అయోధ్య రామ మందిరం కోసం దశాబ్దాలుగా దీక్ష.. చివరికి ఇలా..!
Narayan Jartharghar In Deeksha For Ayodhya Ram Mandir
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 22, 2024 | 4:42 PM

Share

అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేదీ కోట్లాది మంది హిందువుల కల. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి అయోధ్య కేసు సాగగా.. రాముడికి గుడి కట్టాలని హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేపట్టారు. ఎందరో త్యాగాల ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ట పూర్తి చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముడి ఆలయం ప్రారంభమైంది. అయితే మందిర నిర్మాణమనే స్వప్నం సాకారం కావడం కోసం దేశంలోని చాలా మంది దీక్షలు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే మహిళ రామ మందిర నిర్మాణం కోసం 1992 నుంచి ఉపవాస దీక్షలో ఉంది. అప్పటి నుంచి ఆమె పండ్లు, పాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తోంది. రామ మందిర నిర్మాణం ప్రారంభమయ్యే వరకూ ఉపవాస దీక్ష చేస్తానని ప్రకటించిన ఆమె 28 ఏళ్లపాటు మాట మీద నిలబడ్డారు.

ఈక్రమంలోనే కర్ణాటకలోని హుబ్లీకి చెందిన గణేష్ జర్తర్‌ఘర్ అనే వ్యక్తి కూడా ఇలాంటి దీక్ష చేపట్టారు. గణేష్ జర్తర్‌ఘర్ చిన్ననాటి నుంచే శ్రీరాముడంటే ఎంతో భక్తి. సీతా రాముల పట్ల అమితమైన భక్తిభావం ఉండేది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావాలని ఆయన కోరుకున్నారు. తన కోరికలు నెరవేరే వరకు జుట్టు కత్తిరించకోనని శపథం చేశారు. విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు 1990లో అయోధ్యలో జరిగిన కరసేవ కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. ఎట్టకేలకు రామ మందిర నిర్మాణం పూరై రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరారు. దీంతో తాన సంకల్ప నెరవేరడంతో దీక్ష విరమించారు నారాయణ్. దశాబ్ధాలుగా పెంచుకున్న జుట్టు, గడ్డం తొలగించి ఆయోధ్య రాముడి మొక్కు చెల్లించుకున్నారు. హుబ్లీలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వెంట్రుకలను సమర్పించుకున్నారు. నారాయణ్ జర్తర్‌ఘర్ హుబ్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఢిప్యూటీ మేయర్‌ నారయణ్ జర్తర్‌ఘర్ సోదరుడే గణేష్ జర్తర్‌ఘర్ బాధ్యతలు కూడా నిర్వహించారు.

సంకల్ప అనేది దానిని సాధించే దిశ వరకు కొనసాగుతుంది. దానికి ఎటువంటి నిర్ణీత సమయం లేదు. కోరిన కోరికను పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. దానికి ఓపిక అవసరం. ఎట్టకేలకు తన కోరిక నెరవేరడం పట్ల గణేష్  సంతోషం వ్యక్తం చేశారు. రాముడి ప్రాణ ప్రతిష్ట తన జీవితాన్ని ప్రేమతో ఆనందం, విజయంతో నింపిందన్నారు. రాముడి దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన నారాయణ్ జర్తర్‌ఘర్ పలువురు ప్రముఖులు అభినందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…