Viral Video: పిచ్చి పీక్ స్టేజ్‌.. ఎవరూ సృష్టించని వరల్డ్ రికార్డ్ సృష్టించాలనుకున్నాడు.. చివరికి

ఈ వ్యక్తి తన ముక్కులో 68 అగ్గిపుల్లలను పెట్టుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం వ్యక్తి పేరు పీటర్ వాన్ టాంగెన్ బస్కోవ్. పీటర్ ఈ ప్రపంచ రికార్డు సాధించడమే కాదు ప్రపంచంలోనే ఈ రికార్డు సాధించిన మొదటి వ్యక్తి కూడా అతనే. అంటే పీటర్ కంటే ముందు ఎవరూ ఇలాంటి ప్రపంచ రికార్డు సృష్టించలేదు. నిబంధనల ప్రకారం రికార్డును సృష్టించడానికి ఒక వ్యక్తి తన ముక్కులో కనీసం 45 అగ్గిపుల్లలను నింపాలి

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్‌.. ఎవరూ సృష్టించని వరల్డ్ రికార్డ్ సృష్టించాలనుకున్నాడు.. చివరికి
Matchsticks In NostrilsImage Credit source: Twitter/@GWR
Follow us
Surya Kala

|

Updated on: Feb 22, 2024 | 1:27 PM

ప్రపంచ రికార్డును సృష్టించాలనుకునే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే అలా చేసే శక్తి  ప్రతి ఒక్కరిలో ఉండదు. ఎందుకంటే ప్రపంచ రికార్డు సృష్టించానికి అవసరమైన హార్డ్ వర్క్‌ను చేయాల్సిందే.  రికార్డులు సృష్టించే వ్యక్తులు ఇతర వ్యక్తులకు కూడా స్ఫూర్తి నిచ్చే  కొన్ని ప్రపంచ రికార్డులు ఉన్నాయి. వీటి  గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆ రికార్డులను బద్దలు కొట్టాలని భావిస్తారు. కొందరు ప్రయత్నిస్తారు కూడా.. డెన్మార్క్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఓ రికార్డు సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వాస్తవానికి, ఈ వ్యక్తి తన ముక్కులో 68 అగ్గిపుల్లలను పెట్టుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం వ్యక్తి పేరు పీటర్ వాన్ టాంగెన్ బస్కోవ్. పీటర్ ఈ ప్రపంచ రికార్డు సాధించడమే కాదు ప్రపంచంలోనే ఈ రికార్డు సాధించిన మొదటి వ్యక్తి కూడా అతనే. అంటే పీటర్ కంటే ముందు ఎవరూ ఇలాంటి ప్రపంచ రికార్డు సృష్టించలేదు. నిబంధనల ప్రకారం రికార్డును సృష్టించడానికి ఒక వ్యక్తి తన ముక్కులో కనీసం 45 అగ్గిపుల్లలను నింపాలి.  అయితే పీటర్ తన ముక్కుల్లో 68 అగ్గిపుల్లలను చొప్పించుకున్నాడు. దీంతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

ఇది నిజంగా బాధించలేదు

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం పీటర్ అతను సాధించిన ‘సరదా రికార్డు పలువురిని కలవరపరిచాడు. అయితే పీటర్ రికార్డ్ సృష్టించడానికి అనేక రికార్డ్స్ ను పరిశీలించాడు. చివరకు అతని ముక్కులోకి అగ్గిపుల్లని చొప్పించాలనే ఆలోచన కలిగింది. పీటర్ కూడా ముక్కున వేలేసుకునే విధంగా ప్రపంచ రికార్డు సాధించాలని తాను అనుకోలేదని, తన చిన్నతనంలో కూడా తాను ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదని చెప్పాడు. అయితే ఇప్పుడు తాను కూడా ప్రపంచ రికార్డు సృష్టించగలిగినందుకు సంతోషిస్తున్నాట్లు పేర్కొన్నాడు.

తాను ఎల్లప్పుడూ జీవితంలోని ఆసక్తికరమైన, ప్రత్యేకమైన అంశాలను ప్రయత్నించాలని భావిస్తానని పీటర్ పేర్కొన్నాడు. తన ముక్కులో ఇన్ని అగ్గిపుల్లలు పెట్టుకున్నప్పటికీ తనకు ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నాడు. తన ముక్కు చాలా పెద్దదని, చర్మం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని, ఈ రికార్డు సాధించడంలో ఈ లక్షణాలు తనకు గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి సహాయపడ్డాయని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..