AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buddha Relics: నేడు భారత్-థాయ్ దేశాలకు వెరీవెరీ స్పెషల్.. బుద్ధుడి చిహ్నాలు ఆ దేశ ప్రజలకు కనువిందు

బుద్ధుడు తన శిష్యులకు అందించిన బోధనల జ్ఞాపకార్థం బౌద్ధ సమాజానికి చెందిన ప్రజలు మాఘ పూజ (మఖ బుచా డే)ని జరుపుకుంటారు. ఈ రోజు నుంచి బుద్ధునికి సంబంధించిన జ్ఞాపికను థాయిలాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఆ దేశ ప్రజలు బుద్ధుడి పట్ల తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తారు. ఈ యాత్ర మార్చి 19 వరకు కొనసాగుతుంది. అనంతరం ఈ చిహ్నాలు తిరిగి భారతదేశానికి చేరుకుంటాయి. 

Buddha Relics: నేడు భారత్-థాయ్ దేశాలకు వెరీవెరీ స్పెషల్.. బుద్ధుడి చిహ్నాలు ఆ దేశ ప్రజలకు కనువిందు
Buddha Relics
Surya Kala
|

Updated on: Feb 22, 2024 | 1:06 PM

Share

ఫిబ్రవరి 22వ తేదీ గురువారం అంటే ఈ రోజు భారతదేశం-థాయ్‌లాండ్ సంబంధాల పరంగా ప్రత్యేక రోజు. బుద్ధునికి సంబంధించిన అనేక సావనీర్‌లు ఈ రోజు భారతదేశం నుండి థాయ్‌లాండ్‌కు వెళ్లనున్నాయి. వీటిలో నాలుగు ఒక్క ఢిల్లీ నేషనల్ మ్యూజియంకు చెందినవే ఉన్నాయి. ఈ నాలుగు గుర్తులు సేకరించిన తర్వాత ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంచారు. ఈ సావనీర్లు థాయిలాండ్‌లోని ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు. రానున్న 26 రోజుల పాటు పబ్లిక్‌గా కనిపిస్తూ కనువిందు చేయనున్నాయి.

బుద్ధ భగవానుడుతో అతని ఇద్దరు శిష్యులు సరిపుత్ర, మహా మొగ్గలనా ప్రజలు సందర్శించడానికి రెడీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో సిద్ధార్థనగర్ జిల్లా పిప్రహ్వా గ్రామంలో తవ్వకాల్లో ఈ సావనీర్లు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ మతంలో ఈ అవశేషాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది.

బీహార్ గవర్నర్ కూడా వెళ్తున్నారు

బుద్ధుడు, అతని శిష్యుల చిహ్నాలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. వీటితో పాటు బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ , కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని 22 మంది సభ్యుల బృందం థాయ్‌లాండ్ వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి

ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా రవాణా

ఈ పవిత్ర కళాఖండాలన్నీ భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం ద్వారా రవాణా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సన్నాహాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్న తర్వాత జ్ఞాపికలన్నీ బ్యాంకాక్ నేషనల్ మ్యూజియంలో భద్రపరుస్తారు. ఆ దేశంలో వీటికి  గ్రాండ్ వెల్ కమ్ చెప్పనున్నారు.

బుద్ధుడు తన శిష్యులకు అందించిన బోధనల జ్ఞాపకార్థం బౌద్ధ సమాజానికి చెందిన ప్రజలు మాఘ పూజ (మఖ బుచా డే)ని జరుపుకుంటారు. ఈ రోజు నుంచి బుద్ధునికి సంబంధించిన జ్ఞాపికను థాయిలాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఆ దేశ ప్రజలు బుద్ధుడి పట్ల తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తారు. ఈ యాత్ర మార్చి 19 వరకు కొనసాగుతుంది. అనంతరం ఈ చిహ్నాలు తిరిగి భారతదేశానికి చేరుకుంటాయి.

థాయిలాండ్  ప్రజలు  బౌద్ధమతం

థాయిలాండ్ పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందినప్పటికీ.. ఆగ్నేయ భారతదేశంలో బానిసతత్వం లేని ఏకైక దేశం ఇది. బౌద్ధమతం మాత్రమే కాదు.. రాచరికం, సైన్యం ఇక్కడి ప్రజల సమాజాన్ని, జీవితాన్ని తీర్చిదిద్దాయి. 1947 తర్వాత దేశంలో ఎక్కువ కాలం సైనిక పాలన కొనసాగింది. అవును ఈ మధ్య కొంతకాలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే అతి తక్కువ కాలం మాత్రమే ప్రజాస్వామ్య పాలన సాగింది.

దాదాపు 7 కోట్ల జనాభా కలిగిన థాయ్‌లాండ్‌లోని ప్రతి ఏడవ వ్యక్తి రాజధాని బ్యాంకాక్‌లో నివసిస్తున్నారు. దేశంలో అత్యధిక జనాభా బౌద్ధమతాన్ని విశ్వసిస్తారు. ఒక నివేదిక ప్రకారం జనాభాలో 94 శాతం మంది బౌద్ధమతాన్ని విశ్వసిస్తున్నారు. అది కూడా వారి ఆచారాలలో ఒక భాగం. థాయ్ రాజ్యాంగంలో బౌద్ధమతం లేదా మరే ఇతర మతాన్ని అధికార మతంగా ప్రకటించనప్పటికీ.. ఈ దేశం బౌద్ధమత ప్రచారానికి గొప్ప ప్రాధాన్యతనిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..