PM Modi: ‘చిన్న రైతులకు సాయం చేయడమే మా లక్ష్యం’.. అమూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోడీ.. వీడియో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమూల్ సంస్థ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అమూల్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమూల్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమూల్ సంస్థ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అమూల్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమూల్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ చిన్న రైతులకు సహాయం చేయడమే మా ధ్యేయమన్నారు. అందులో భాగంగానే కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టామన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోడీ. అమూల్ రాబోయే 25 ఏళ్ల విజన్‌పై వారితో చర్చించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా 22,850 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని. 600 కోట్లతో ఏర్పాటు చేసిన సబర్ డెయిరీకి చెందిన ఆధునిక చీజ్ ప్లాంట్, ఆనంద్ వద్ద అమూల్ డెయిరీకి చెందిన లాంగ్ లైఫ్ టెట్రా పాక్ మిల్క్ ప్లాంట్, దాని చాక్లెట్ ప్లాంట్ విస్తరణతో సహా ఐదు కొత్త డెయిరీ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.