Hyderabad: చికిత్స చేస్తూ యువతి పెదవి కట్ చేసిన డెంటిస్ట్.. ఏడాది అయినా ఇబ్బంది తప్పడం లేదని తల్లి ఆవేదన
జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్ హాస్పిటల్‌లో అనస్థీషియా ఓవర్ డోస్ కారణంగా ఇటీవల ఒకరు మరణించిన ఘటనతో ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుల్లో ఒకరు అంతకుముందు అక్కడ దంత చికిత్స తీసుకోవడానికి వెళ్లి భయంకరమైన అనుభవం కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. డెంటిస్టు తన వద్ద ట్రీట్మెంట్ కు వచ్చిన ఒక మహిళ పెదవిని కత్తిరించాడు. దీంతో ఆమె చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంది.

హైదరాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దంతవైద్యుడు రొటీన్ చెకప్ కోసం తన దగ్గరకు వచ్చిన మహిళ పెదవులను కోయడమే కాదు.. ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను వెక్కిరించాడు. అంతేకాదు ఇప్పుడు ఆమె మరింత బాగుందంటూ కామెంట్ చేశాడు. వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ పెదవి కట్ జరిగిన ఘటన FMS క్లినిక్‌లో జరిగింది. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో మహిళ కింది పెదవిలోని కుడి భాగం కట్ అయినట్లు చిత్రంలో చూడవచ్చు. సౌమ్య మాట్లాడుతూ ఒక సంవత్సరం పైగా గడిచిపోయింది. అయినప్పటికీ తన స్నేహితురాలు తన పెదవులను పూర్తిగా చాచలేకపోతోంది.. బహిరంగంగా నవ్వలేకపోతోందని పేర్కొంది. పెదవుల ఫ్లెక్సిబిలిటీని తిరిగి తీసుకురావడానికి ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకునే పరిస్థితి నెలకొంది.
జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్ హాస్పిటల్‌లో అనస్థీషియా ఓవర్ డోస్ కారణంగా ఇటీవల ఒకరు మరణించిన ఘటనతో ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుల్లో ఒకరు అంతకుముందు అక్కడ దంత చికిత్స తీసుకోవడానికి వెళ్లి భయంకరమైన అనుభవం కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. డెంటిస్టు తన వద్ద ట్రీట్మెంట్ కు వచ్చిన ఒక మహిళ పెదవిని కత్తిరించాడు. దీంతో ఆమె చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంది.
At FMS Hospital in Jubilee Hills, where a patient passed away during dental procedure due to anesthesia overdose, one of my friends too had a horrific dental treatment experience there earlier. The dentist accidentally chopped off her lip, leaving a deep depression in her mouth. pic.twitter.com/43vt4fBcZF
— Sowmya Sangam (@sowmya_sangam) February 20, 2024
జూబ్లీహిల్స్‌లోని అదే ఎఫ్‌ఎంఎస్ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగిందని.. ఇటీవల ఒక రోగి అనస్థీషియా ఓవర్ డోస్ కారణంగా మరణించాడని సౌమ్య చెప్పారు. బాధితురాలి తల్లి గూగుల్‌లో ఆసుపత్రిపై ప్రతికూల సమీక్ష ఇవ్వడమే కాదు.. కొన్ని నెలల్లో తన కుమార్తె పెదవులు నయం అవుతాయని వైద్యులు హామీ ఇచ్చారని పేర్కొంది. అయితే ఈ ఘటన జరిగి ఒక సంవత్సరం తర్వాత కూడా దంతవైద్యుని నిర్లక్ష్యం వలన ఏర్పడిన పరిణామాలను ఇంకా అనుభవించవలసి వస్తుందని పేర్కొన్నారు.
బాధిత రోగి తల్లి సమీక్ష ప్రకారం ఆమె తన కుమార్తె చికిత్స గురించి ఆసుపత్రి ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడినప్పుడు, తమ బాధను ఎగతాళి చేస్తూ కామెంట్ చేశారని పేర్కొంది. తమ సమస్య విన్న తర్వాత ఆస్పత్రి సిబ్బంది బిగ్గరగా నవ్వడం ప్రారంభించారని అక్కడ సిబ్బంది తీరుని తెలియజేసింది.
ఫిబ్రవరి 16 న హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ నారాయణ్ వింజమ్ ‘స్మైల్ డిజైనింగ్’ సర్జరీ కోసం FMS ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో చేరగా.. శస్త్రచికిత్స సమయంలో అతని ఆరోగ్యం క్షీణించింది. అనంతరం మరణించాడు. మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడం వల్లే మృతి చెందినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విషయం విచారణలో ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




