Twins day 2024: ట్విన్స్ డే – విశాఖలో కలిసిన ఆంధ్రా, తెలంగాణ ట్విన్స్
ఫిబ్రవరి 22 - ట్విన్స్ డే. ఇలాంటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని కవలలంతా కలవడం ఒక అద్భుతమైన ఘటనే అవుతుంది. ఒకే తల్లి కడుపున కవలలుగా జన్మించిన వీరంతా కలిసి వేడుక చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ వేడుకకు సాగర తీరం విశాఖలో వేదికైతే.. ఇక చెప్పేదేముంది. ఎస్.. విశాఖ లో రెండు రాష్ట్రాల కవలలు సందడి చేశారు.
ఫిబ్రవరి 22 – ట్విన్స్ డే. ఇలాంటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని కవలలంతా కలవడం ఒక అద్భుతమైన ఘటనే అవుతుంది. ఒకే తల్లి కడుపున కవలలుగా జన్మించిన వీరంతా కలిసి వేడుక చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ వేడుకకు సాగర తీరం విశాఖలో వేదికైతే.. ఇక చెప్పేదేముంది. ఎస్.. విశాఖ లో రెండు రాష్ట్రాల కవలలు సందడి చేశారు. 25 కి పైగా కవల జంటలు ఒక్క చోట చేరడంతో ఎటు చూసినా కవలలే కనిపించారు. తోటి కవలలతో సంతోషంగా గడిపారు.
ఒకే రూపం మనుషులు మాత్రం ఇద్దరు
అచ్చం ఒకరిని పోలిన వారు ఇంకొకరు. అలా 25 జంటలు. ఏదో సినిమాలో చూపినట్టు ఒకేచోట కలిసి ఆడుతూ, పాడుతూ చేసిన సందడి వావ్ అనిపించింది. ఈ వేడుకలు చూడడానికి వచ్చినవారికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. విశాఖపట్నంలోని ఓ హోటల్ లో ఈ ట్విన్స్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 25 కవల జంటలు ఇందులో పాల్గొన్నాయి.
వాట్సప్ గ్రూప్ ద్వారా టచ్ లో…
ఈ ట్విన్స్ డే వేడుకలలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్ని వయసుల వారు ఉండడం విశేషం. కేకులు కట్ చేసుకుని ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉత్సాహపడ్డారు. అంతేకాదు కవలలుగా నిత్యం తమకు ఎదురయ్యే అనుభవాలు, సరదా సన్నివేశాల వంటివి షేర్ చేసుకుంటు అందరూ కలిసి డిన్నర్ చూశారు. అంతటితో ఆగారా.. వారిలో ఉన్న కళలను ప్రదర్శించారు. ఒకే పోలికలతో ఉన్న జోడిలను చూసి వీక్షకులు మైమరచిపోయారు. వీరంతా ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా టచ్ లో ఉన్నారట. ప్రతి ఏడాది కలుస్తారట. మరి ఆ దృశ్యాలు మీరు కూడా చూస్తారా…!
చూసి ఆనందించండి మరి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…