Telugudesam: వైసీపీలో క్లారిటీ.. టీడీపీ పొత్తులో పేచీ.. బీజేపీ నుంచి కొత్త అభ్యర్థి..

తిరుపతి పార్లమెంటు పై వైసీపీలో క్లారిటీ ఉంది. సిట్టింగ్ ఎంపీని అటు ఇటుగా మార్చి ఎట్టకేలకు తిరుపతి అభ్యర్థిగానే వైసీపీ ఫిక్స్ చేసింది. అయితే ప్రత్యర్థి పోటీపై పొత్తుల పేచీ నెలకొంది. ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పొత్తు ఏ పార్టీకి కలిసి వస్తుందోనన్న సందిగ్ధత విపక్షంలో నెలకొంది. తిరుపతి పార్లమెంటు ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గం.

Telugudesam: వైసీపీలో క్లారిటీ.. టీడీపీ పొత్తులో పేచీ.. బీజేపీ నుంచి కొత్త అభ్యర్థి..
Tirupati Mp Candidate
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 22, 2024 | 9:43 PM

తిరుపతి పార్లమెంటు పై వైసీపీలో క్లారిటీ ఉంది. సిట్టింగ్ ఎంపీని అటు ఇటుగా మార్చి ఎట్టకేలకు తిరుపతి అభ్యర్థిగానే వైసీపీ ఫిక్స్ చేసింది. అయితే ప్రత్యర్థి పోటీపై పొత్తుల పేచీ నెలకొంది. ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పొత్తు ఏ పార్టీకి కలిసి వస్తుందోనన్న సందిగ్ధత విపక్షంలో నెలకొంది. తిరుపతి పార్లమెంటు ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గం. అన్ని పార్టీలకు ముఖ్యమైన నియోజకవర్గం ఇది. అయితే తిరుపతి ఎంపీ టికెట్ కేటాయింపు, పోటీ విషయంలో అధికార వైసీపీ, విపక్ష పార్టీల మధ్య అభ్యర్థుల ఊగిసలాట కొనసాగింది. తిరుపతి, చిత్తూరు ఎంపీల స్థానాలు మార్పు చేసిన వైసీపీ హైకమాండ్ ఎట్టకేలకు ఒక క్లారిటీకి ఇచ్చింది. ఇద్దరినీ అదే స్థానంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికే అవకాశం దక్కింది. అధికారపక్షంలో కన్ఫ్యూజన్ లేకపోయినా విపక్షం అభ్యర్థి ఎవరన్న దానిపైనే అయోమయం కొనసాగుతోంది. తిరుపతి పార్లమెంట్‎పై టిడిపి మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే జనసేనతో జతకట్టిన టిడిపి పొత్తులో భాగంగా బిజెపితోనూ చేయి కలిపితే ఏ పార్టీ పోటీ చేయాలి ఎవరు బరిలో ఉండాలి అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు.

ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ ఫ్యామిలీ పేరు బలంగా వినిపిస్తోంది. రత్నప్రభ కూతురు నిహారికనే టిడిపి తిరుపతి ఎంపీ అభ్యర్థి అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే నిహారిక టిడిపి అభ్యర్థిగా బరిలో దిగుతారా.. లేదంటే ఏ పార్టీకి టికెట్ కేటాయిస్తే ఆ పార్టీ కండువా కప్పుకుని పోటీలో ఉంటారా అన్న ప్రచారం కూడా అంతే స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా పొత్తు విషయం ఎటూ తేలకపోవడంతో విపక్షం నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎవరు బరిలో ఉంటారో అన్న సస్పెన్స్ కేడర్ మెదళ్ళలను తొలచివేస్తోంది. టిడిపి జనసేన బిజెపి ఈ మూడు పార్టీల్లోనూ కొంత గందరగోళం నెలకొంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్సీ రిజర్వర్డు నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు కుస్తీ పడుతున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో తిరుపతిని టిడిపి.. బిజెపికి కేటాయించింది. అప్పట్లో బిజెపి ఎంపీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి గెలుపొందారు. అందుకే తిరుపతిని తిరిగి బిజెపి కోరుకునే అవకాశం ఉంది. పొత్తు కుదిరితే ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. గత తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో బరిలోకి దిగిన కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ కూతురు నిహారిక కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రత్నప్రభకు బదులుగా చిత్తూరు జిల్లా కోడలైన నిహారిక బిజెపి అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

మాజీ ఎంపీ తలారి మనోహర్ రెండో కొడుకు భార్య అయిన నిహారికకు టిడిపి ఫ్యామిలీతో అనుబంధం ఉంది. నిహారిక మామ తలారి మనోహర్ ఎంపీగా, బావ తలారి ఆదిత్య సత్యవేడు టిడిపి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ రాజకీయ కుటుంబం నుంచి కోడలుగా ఆమెకే ఛాన్స్ ఉంటుందన్న అభిప్రాయం కేడర్ లోనూ ఉంది. 2009లో తలారి మనోహర్ ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి, ఆ పార్టీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా మళ్లీ మనోహర్ కుటుంబం టిడిపిలోకి వచ్చి పెద్ద కొడుకు తలారి ఆదిత్యను 2014లో టిడిపి నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిపించుకోగలిగారు. ఇలా మాజీ ఎంపీ తలారి మనోహర్ కుటుంబం కోడలిగా నిహారిక టిడిపి తరఫున పోటీ చేస్తారా.. లేదంటే పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థి అవుతారా అన్న విషయం తీవ్ర ఆసక్తిరేపుతోంది. అయితే ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా తానే బహిలో ఉంటాను అన్న ధీమాతో ఉన్న మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కొత్త సమీకరణలతో అసంతృప్తికి గురి అవుతున్నారు. పనబాక లక్ష్మిని సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వుర్డ్ అసెంబ్లీ స్థానానికి పంపాలని భావిస్తున్న టిడిపి అధిష్టానం నిహారిక వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!