తెలుగమ్మాయి జాహ్నవి మృతి కేసులో అన్యాయం.. ఆధారాల్లేవన్న వాషింగ్టన్ కోర్టు..!

Jaahnavi Kandula death: కర్నూలు అమ్మాయి కందుల జాహ్నవి... గతేడాది జనవరి 23న అమెరికా సియాటెల్‌లో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని చనిపోయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీస్‌ అధికారి డేనియల్‌.. జాహ్నవి డెత్‌పై చులకనగా మాట్లాడటంతో సంచలనమైది. ఆమె ఓ సాధారణ వ్యక్తి... అసలామె మరణానికి విలువే లేదు... అంటూ పగలబడి నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర దుమారం రేపింది.

తెలుగమ్మాయి జాహ్నవి మృతి కేసులో అన్యాయం.. ఆధారాల్లేవన్న వాషింగ్టన్ కోర్టు..!
Jaahnavi Kandula Death
Follow us

|

Updated on: Feb 22, 2024 | 12:41 PM

Jaahnavi Kandula death: కర్నూలు అమ్మాయి కందుల జాహ్నవి… గతేడాది జనవరి 23న అమెరికా సియాటెల్‌లో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని చనిపోయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీస్‌ అధికారి డేనియల్‌.. జాహ్నవి డెత్‌పై చులకనగా మాట్లాడటంతో సంచలనమైది. ఆమె ఓ సాధారణ వ్యక్తి… అసలామె మరణానికి విలువే లేదు… అంటూ పగలబడి నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర దుమారం రేపింది. 23 ఏళ్ల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మరణించిన ఈ ఇన్సిడెంట్‌పై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అమెరికాను డిమాండ్‌ చేసింది ఇండియన్‌ గవర్నమెంట్‌. దాంతో, అప్పటికప్పుడు సియాటెల్‌ పోలీస్‌ అధికారి డేనియల్‌పై సస్పెన్షన్‌ వేటేసింది అమెరికా. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. త్వరలోనే తుది తీర్పు ఇవ్వనుంది కోర్టు.

అయితే, అసలు జాహ్నవి మృతికి కారణమైన పోలీస్‌ అధికారి కెవిన్‌ డవేపై మాత్రం ఎలాంటి ఆధారాల్లేవంటూ కేసు కొట్టేసింది కోర్టు. జాహ్నవిని ఢీకొట్టింది కెవిన్‌ డవేనే అనడానికి సాక్ష్యాధారాలు లేవని తేల్చేసింది. సీనియర్‌ అటార్నీలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం. దాంతో, జాహ్నవికి అన్యాయం జరిగిందనే మాట గట్టిగా వినిపిస్తోంది.

జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ మాట్లాడిన పోలీస్‌ అధికారి డేనియల్‌ కూడా యాక్సిడెంట్‌ స్పాట్‌లో లేరని తేల్చేసింది కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ. అయితే, డేనియల్‌ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. డేనియల్‌ వ్యాఖ్యలు.. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం తగ్గించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ఇక, డేనియల్‌పై మార్చి 4న తుది నిర్ణయం ప్రకటించనుంది కోర్టు.

వాషింగ్టన్‌ కోర్టు నిర్ణయంపై జాహ్నవి బంధువులు, అమెరికాలోని భారతీయ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌ అతివేగంగా కారు నడిపి ఓ అమ్మాయి ప్రాణాలు తీసేస్తే.. ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. జాహ్నవి మృతిపై వెకిలిగా మాట్లాడిన మరో పోలీస్‌ అధికారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని నిలదీస్తున్నారు

అమెరికా మీడియా కథనాల ప్రకారం… అతివేగం, కారు ఢీకొనడంతోనే జాహ్నవి మరణించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రూట్‌లో స్పీడ్‌ లిమిట్‌ గంటకు 40 కిలోమీటర్లు ఉండగా… కెవిన్‌ మాత్రం 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చాడు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవిని అత్యంత వేగంతో ఢీకొట్టాడు. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టడంతో వంద మీటర్లపైకి ఎగిరిపడిందని ప్రాథమిక రిపోర్ట్‌లో రాశారు సియోటెల్‌ పోలీసులు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..