ఇది కదా నిజమైన ప్రేమంటే.. మా కుక్క తప్పిపోయింది.. కనిపిస్తే చెప్పండి..
ఫ్లెక్సీలు, బ్యానర్‌లు, హోర్డింగులు నగర, పట్టణ జీవితంలో భాగస్వామ్యమైపోయాయి. ప్రతి చిన్న శుభ, అశుభ కార్యాలతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ ప్లెక్సీ ల హాడావుడి పెరిగిపోయింది. సాధారణంగా రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ప్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే నర్సరావుపేటలో రెండు రోజుల నుండి కనిపిస్తున్న ప్లెక్స్ లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఏంటా ఆ ప్లెక్సీలు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి..
ఫ్లెక్సీలు, బ్యానర్‌లు, హోర్డింగులు నగర, పట్టణ జీవితంలో భాగస్వామ్యమైపోయాయి. ప్రతి చిన్న శుభ, అశుభ కార్యాలతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ ప్లెక్సీ ల హాడావుడి పెరిగిపోయింది. సాధారణంగా రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ప్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే నర్సరావుపేటలో రెండు రోజుల నుండి కనిపిస్తున్న ప్లెక్స్ లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఏంటా ఆ ప్లెక్సీలు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి.. నర్సరావుపేటకు చెందిన బొంతా సువర్ణ రాజు వినుకొండ రోడ్డులోని తాళ్లూరి నగర్ నివాసం ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క పిల్లను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. దానికి య్యాచీ అని పేరు పెట్టారు. పేరు పెట్టడమే కాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం య్యాచీకి ఐదేళ్లు వచ్చాయి. కుటుంబ సభ్యులందరితో య్యాచీ కలిసి పోయింది. దీంతో దాని పట్ల కుటుంబసభ్యలందరూ అప్యాయంగా ఉంటూ వస్తున్నారు. అయితే, గత ఆదివారం య్యాచీ అదృశ్యమైంది. ఎప్పటి లాగా రాత్రి భోజనం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారిన తర్వాత చూస్తే య్యాచీ కనపడలేదు. ఏమైందా అని గాలించడం మొదలు పెట్టారు. ఇప్పటివరకూ య్యాచీ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. కుటుంబ సభ్యలందరూ టౌన్ మొత్తం గాలించిన య్యాచీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో వినూత్న ఆలోచన చేశారు.
య్యాచీ ఫోటోతో ప్లెక్స్ వేయించారు. తెల్లవారేసరికి దాదాపు వంద ప్లెక్స్ లను నగరం మొత్తం ఏర్పాటు చేశారు. ప్లెక్స్ లో య్యాచీ ఫోటోతో పాటు సువర్ణ రాజు అడ్రస్, ఫోన్ నంబర్ సైతం ఇచ్చారు. ప్లెక్స్ తో పాటు పోస్టర్లు కూడా వేయించారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ లోనూ పోస్టర్లు వెలిశాయి. అయినప్పటికీ య్యాచీ అడ్రస్ లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. గత ఐదేళ్లుగా య్యాచీని కుటుంబ సభ్యుడిలా పెంచుకున్నామని ఇప్పుడు దానిని ఎవరైనా దొంగలించారా అన్న అనుమానం కలుగుతుందని సువర్ణ రాజు తెలిపారు. పోలీస్ కేస్ పెట్టేందుకు సిద్దమయ్యారు.
అయితే, పట్టణంలో పెద్ద ఎత్తున వెలిసిని ప్లెక్స్ లను చూసిన స్థానికులు, ప్రయాణికులు అటుగా వెళ్లేవారు.. ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు అదృశ్యమైతే వేయాల్సిన ఫ్లెక్సీ.. ఏకంగా కుక్క తప్పిపోవడంతో వేశారంటూ చర్చించుకుంటున్నారు. మరికొందరైతే.. ఇది నిజమైన ప్రేమంటూ ఆ కుటుంబసభ్యులను అభినందిస్తున్నారు. ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తప్పకుండా దొరుకుతుందిలే అంటూ వారికి ఓదార్పు మాటలు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..