AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకేష్‎కు పప్పుతో అభిషేకం చేసిన వైసీపీ శ్రేణులు..

విశాఖలో అధికార ప్రతిపక్ష అనుబంధ విభాగాల నేతలు పరస్పరం వ్యంగ కార్యకలాపాలకు పూనుకున్నారు. తాజాగా లోకేష్‎కు కుండలో పప్పు‎ను బహుమతిగా ఇవ్వడాన్ని సీరియస్‎గా తీసుకున్న తెలుగుదేశం విద్యార్థి విభాగం నేతలు ఈరోజు అమర్ పోస్టర్‎పై కోడి గుడ్లతో దాడి చేశారు. అంతకుమించి గుడ్లతో అభిషేకం కూడా చేశారు.

లోకేష్‎కు పప్పుతో అభిషేకం చేసిన వైసీపీ శ్రేణులు..
Ysrcp Leaders
Eswar Chennupalli
| Edited By: Srikar T|

Updated on: Feb 22, 2024 | 10:19 PM

Share

విశాఖలో అధికార ప్రతిపక్ష అనుబంధ విభాగాల నేతలు పరస్పరం వ్యంగ కార్యకలాపాలకు పూనుకున్నారు. తాజాగా లోకేష్‎కు కుండలో పప్పు‎ను బహుమతిగా ఇవ్వడాన్ని సీరియస్‎గా తీసుకున్న తెలుగుదేశం విద్యార్థి విభాగం నేతలు ఈరోజు అమర్ పోస్టర్‎పై కోడి గుడ్లతో దాడి చేశారు. అంతకుమించి గుడ్లతో అభిషేకం కూడా చేశారు. వెంటనే అలెర్ట్ ఆయిన వైసీపీ యూత్ విభాగ నేతలు లోకేష్‎కు పప్పాభిషేకం చేశారు. పరస్పర వ్యంగ అస్త్రాలు, అభిషేకాలతో విశాఖలో రెండు పార్టీల మధ్య జరిగిన అభిషేక రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇటీవల లోకేష్ అనకాపల్లి పర్యటనలో భాగంగా అమర్నాథ్ హయాంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని కోడి గుడ్డు బహుమతిగా ఇస్తున్నా అంటూ సెటైర్ వేశారు టీడీపీ నేతలు. దానికి కౌంటర్‎గా అమర్ తెల్లారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి లోకేష్ అనవసరపు ఆరోపణలు చేశారంటూ కుండలో ఉడికించిన పప్పును తెచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న అంటూ ప్రదర్శన చేశారు. ఆ వార్ అంతటితో ఆగలేదు. టీడీపీ, వైఎస్సార్సీపీల అనుబంధ విభాగాలు మళ్లీ ఆ వివాదాన్ని కొనసాగిస్తున్నాయి.

అమర్‎నాథ్ చిత్రపటం పై కోడి గుడ్ల దాడి

తాజాగా ఈరోజు తెలుగు విద్యార్థి విభాగం లోకేష్‎పై మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొడుతూ అభిషేకం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు,లోకేష్‎పై మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అమర్నాథ్ తీసుకువచ్చిన పరిశ్రమలు వద్ద నించొని సెల్ఫీ తీసుకొని పెట్టగలరా? అంటూ నిలదీశారు. ఇది ట్రైలర్ మాత్రమే అని, మా నాయకులపై మంత్రి గుడివాడ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

లోకేష్‎కు పప్పాభిషేకం

అమర్ చిత్రపటంపై కోడిగుడ్లతో దాడి చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేతలకు వైసీపీ యువజన విభాగం నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఎక్కడైతే అమర్నాథ్‎ను అవమానించారో, సరిగ్గా అదే ప్రదేశంలో వైసిపి కార్యకర్తలు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానికి పప్పు అభిషేకం చేశారు. పప్పు ముద్దలతో లోకేష్ ఫ్లెక్సీకి కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ళ శివ గణేష్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం స్థానిక సెవెన్ హిల్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. వైసిపి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంఘటనా స్థాలానికి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల శివ గణేష్ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్పై విమర్శలు చేసే స్థాయి లోకేష్‎కు లేదన్నారు. కనీసం ఎమ్మెల్సీ కూడా కానీ లోకేష్‎ను చంద్రబాబు నాయుడు మంత్రిని చేశాడని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి లోకేష్ ఓడిపోయాడని విమర్శించారు. బ్యాక్ డోర్‎లో వచ్చి మంత్రి అయినది లోకేష్ ఒక్కడేనని అన్నారు. అమర్నాథ్ కుటుంబం దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉందని కార్పొరేటర్‎గా పనిచేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన అమర్నాథ్‎ను విమర్శించే హక్కు ఈ పప్పుముద్దకు లేదని గణేష్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…