Gas Saving Tips: ఇంట్లో వంట గ్యాస్‌ను ఆదా చేయడం ఎలా? ఈ కిచెన్ టిప్స్ మీ కోసమే..
అందుకే ప్రభుత్వం కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే, పెరుగుతున్న ధరల కారణంగా గ్యాస్ సిలిండర్ మీ జేబును ఖాళీ చేస్తుంది. ప్రజలు గ్యాస్ ఆదా చేయడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు. గ్యాస్ సిలిండర్‌ని ఉపయోగించిన తర్వాత దాని రెగ్యులేటర్‌ను స్విచ్ ఆఫ్ చేస్తే, గ్యాస్ ఆదా అవుతుందని, అది ఎక్కువ రోజులు వస్తుందని కొందరు భావిస్తున్నారు. కానీ,..

ఒకప్పుడు మట్టి పొయ్యిలపై కట్టెలు కాల్చి ఇళ్లలో వంట చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని ఇళ్లలో వంటకోసం గ్యాస్ ఉపయోగించే ట్రెండ్ పెరిగింది. భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో వంట చేయడానికి గ్యాస్ సిలిండర్‌నే వాడుతున్నారు. అయితే, మట్టి పొయ్యిపై వంట చేయడం కంటే గ్యాస్ సిలిండర్‌పై వంట చేయడం చాలా సులభం. వంట కూడా త్వరగా పూర్తవుతుంది.
అంతే కాకుండా, గ్యాస్ సిలిండర్‌పై వంట చేయడం ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా మంచిది. ఎందుకంటే మట్టి పొయ్యిలపై కలపను కాల్చడం ద్వారా ఆహారం వండేటప్పుడు వెలువడే పొగ ఆరోగ్యానికి, పర్యావరణానికి రెండింటికీ హానికరం. అందుకే ప్రభుత్వం కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే, పెరుగుతున్న ధరల కారణంగా గ్యాస్ సిలిండర్ మీ జేబును ఖాళీ చేస్తుంది. ప్రజలు గ్యాస్ ఆదా చేయడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు. గ్యాస్ సిలిండర్‌ని ఉపయోగించిన తర్వాత దాని రెగ్యులేటర్‌ను స్విచ్ ఆఫ్ చేస్తే, గ్యాస్ ఆదా అవుతుందని, అది ఎక్కువ రోజులు వస్తుందని కొందరు భావిస్తున్నారు.
సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయటం మర్చిపోవద్దు..
వాస్తవానికి, గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించిన తర్వాత గ్యాస్ లీకేజీ జరగకుండా రెగ్యులేటర్‌ను ఎప్పటికప్పుడు ఆఫ్ చేయాలి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ లీక్ అయితే, కొన్ని కొన్ని సార్లు అది పేలుడుకు కారణమవుతుంది. అందుకే గ్యాస్ ఉపయోగం పూర్తైన వెంటనే రెగ్యులేటర్‌ని ఆఫ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ ఆదా చేయడం ఎలా?
అయితే, మీరు మీ గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలనుకుంటే..మీరు దాని కోసం కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి, తక్కువ-మీడియం మంటలో ఆహారాన్ని ఉడికించాలి. ఎక్కువ మంట మీద ఆహారాన్ని వండటం వల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. అలాగే, గ్యాస్ బర్నర్ లేదా పైపు నుండి గ్యాస్ లీకేజీలు లేకుండా జాగ్రత్తగా ఎప్పటిప్పుడు చెక్ చేసుకుంటూఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








