Chanakya Niti: పొరపాటున కూడా ఈ 5 ప్రదేశాల్లో ఇంటిని నిర్మించవద్దు.. జీవితంలో కష్టాలు తప్పవంటున్న చాణక్య
కొత్త ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు అయితే.. ఆచార్య చాణిక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలను దృష్టిలో పెట్టుకోండి. తద్వారా మీరు మీ భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే ఇంటిని నిర్మించుకునే సమయంలో తెలిసి తెలియక తప్పులు చేస్తే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేనట్లు అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇంటిని ఎల్లప్పుడూ అలాంటి సమస్యలు తలెత్తని ప్రదేశంలో నిర్మించుకోండి.
సొంత ఇల్లు అనేది పేద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కనే కల. తమ ఆర్ధిక శక్తి కొలదీ ఇంటిని నిర్మించుకుంటారు. పొదరిల్లు అయినా, ప్యాలెస్ అయినా సొంత ఇంటిలో జీవిస్తే వచ్చే ఆనందం వేరు అని అంటారు. అయితే మీరు కూడా కొత్త ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు అయితే.. ఆచార్య చాణిక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలను దృష్టిలో పెట్టుకోండి. తద్వారా మీరు మీ భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే ఇంటిని నిర్మించుకునే సమయంలో తెలిసి తెలియక తప్పులు చేస్తే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేనట్లు అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇంటిని ఎల్లప్పుడూ అలాంటి సమస్యలు తలెత్తని ప్రదేశంలో నిర్మించుకోండి.
- జీవనోపాధి: ఇల్లు కట్టుకోవాలంటే జీవనోపాధి సంక్షోభం లేని చోటు చూసుకోవాలని చాణక్య నీతిలో చాణుక్యుడు పేర్కొన్నాడు. ఉపాధి కోసం పని లేని చోట ఎప్పుడూ ఇల్లు కట్టుకోకూడదు. పని లేని చోట ఇల్లు నిర్మించుకుంటే జీవితమంతా పని వెతుక్కుంటూ తిరుగుతూ ఉండాలి. జీవితం కష్టాలతో నిండిపోతుంది.
- లా అండ్ ఆర్డర్: చట్టానికి దాని విలువకు భయపడని ప్రజలు ఉన్న చోట ఎప్పుడూ ఇల్లు కట్టకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి ప్రాంతంలో నివసించే ప్రజలు ఎల్లపుడూ నిరాశకు గురవుతూ జీవించాల్సి ఉంటుంది. అందువల్ల ఇల్లు నిర్మించడానికి లా అండ్ ఆర్డర్ సరిగ్గా అనుసరించే స్థలాన్ని ఎంచుకోండి.
- ముందుగా పరిస్థితిని అంచనా: మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించండి. సమస్య, దాని మూల కారణాలు, సాధ్యమయ్యే పరిణామాలను కూడా విశ్లేషించండి. స్పష్టమైన అవగాహన సమస్యను ఎదుర్కోవటానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి వీలు అవుతుంది.
- దయ, ఆధ్యాత్మిక చింతన: ఇల్లు కట్టుకునేటప్పుడు దయ, ధార్మిక వ్యక్తులు నివసించే స్థలాన్ని ఎంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి ప్రదేశంలో నివసించడం వలన అదే అనుభూతి మీలో ఉంటుంది.
- నిజాయితీ, నైతికత: ఎన్ని కష్టాలు, నష్టాలూ ఎదురైనా.. ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా నిజాయితీ, నైతికతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని.. వాటి ప్రాముఖ్యతను చాణక్యుడు నొక్కి చెప్పాడు. నైతిక విలువలను కాపాడుకోండి, నిజాయితీగా ఉండండి .చిత్తశుద్ధితో వ్యవహరించండి. విజయవంతమైన కెరీర్‌లో విశ్వాసం, మంచి పేరు అమూల్యమైన ఆస్తులని పెర్కొన్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.