Tips To Save Cooking Gas: ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు…. మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది..!

రోజు రోజుకూ గ్యాస్‌ ధరలు భగ్గుమంటున్నాయి.. గతంలో వంట చేయడానికి గ్యాస్‌ తక్కువగా వాడేవారు.. ఇప్పుడు ప్రతి చిన్న ఇంట్లోనే వంటకోసం గ్యాస్‌ వినియోగిస్తున్నారు. వంట గ్యాస్‌ రేట్లు చూస్తే ఇప్పట్లో తగ్గేలా లేవు..కాబట్టి వంట గ్యాస్‌ను ఆదా చేసుకోవడం మనం తప్పనిసరిగా చేయాల్సిన అతి ముఖ్యమైన పని. గ్యాస్‌ను పొదుపు చేయడం వల్ల మన ఇంటి ఖర్చులు తగ్గడమే కాదు.. పర్యావరణానికీ కూడా మేలు చేస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Tips To Save Cooking Gas: ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది..!
Save Cooking Gas
Follow us

|

Updated on: Jul 17, 2024 | 10:18 PM

గ్యాస్‌ స్టౌవ్‌ వాడే ముందు.. గ్యాస్ బర్నర్‌ని శుభ్రంగా ఉంచండి. శుభ్రం చేయకపోతే, పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు. పైప్‌లో గ్యాస్‌ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం రెండు వారాలకు ఒకసారి గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడం మంచిది. బియ్యం, పప్పు వంటి కొన్ని ధాన్యాలతో వండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. బియ్యం, పప్పులు వంటి ధాన్యాలు వంటకు ముందు కడిగి నీటిలో నానబెట్టుకోవటం ఉత్తమం. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది. వంట కూడా త్వరగా పూర్తవుతుంది.

కుక్కర్, పాత్రలు మొదలైనవాటిని కడిగిన తర్వాత వెంటనే…నేరుగా వంట చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుందని మీకు తెలుసా? అవును… వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్‌పై ఉంచినట్లయితే, డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చవుతుంది. చాలా మంది కుక్కర్‌కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసే వారు ప్రెషర్ కుక్కర్ వాడటం మంచిది. దీనివల్ల గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రెషర్ కుక్కర్‎లో వంట చేయడం వల్ల గ్యాస్‎ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్‌ కుకర్‌ అధిక పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుక్కర్‌లో పెట్టుకునే వీలు ఉంది. కాబట్టి త్వరగా వంట పూర్తి అవుతుంది. గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌ నుంచి తీసిన వెంటనే నేరుగా గ్యాస్‎పై పెట్టి వేడి చేసే అలవాటు కూడా గ్యాస్‌ను వృధా చేస్తుంది. అలా చేయడం వల్ల ఆహారం వేడి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఫ్రిజ్ నుంచి ఆహారం బయటకు తీసిన తర్వాత ముందు సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాతే దాన్ని వేడి చేయండి. ఇలా చేస్తే మీ గ్యాస్‌ ఆదా అవుతుంది. చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్‌ ను వాడకపోవడమే మంచిది. అలా వాడటం వల్ల మంట చాలా వరకు బయటికి పోతుంది. అలా కూడా గ్యాస్‌ వృథా అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రధాని మోదీని కలిసిన జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు
ప్రధాని మోదీని కలిసిన జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు
చీరకట్టులో జాన్వీ ఫోటోషూట్ అదిరిందిగా..
చీరకట్టులో జాన్వీ ఫోటోషూట్ అదిరిందిగా..
వార్నీ.. ఆన్‌లైన్‌లో ఎంగేజ్ మెంట్‌..! డిజిటల్‌ ఇండియా అంటే ఇదేనా?
వార్నీ.. ఆన్‌లైన్‌లో ఎంగేజ్ మెంట్‌..! డిజిటల్‌ ఇండియా అంటే ఇదేనా?
గ్లామర్‌ ఇమేజ్‌ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ అంటూన్న
గ్లామర్‌ ఇమేజ్‌ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ అంటూన్న
కుప్పంలో సైకిల్ స్పీడ్‌‌కు ఫ్యాన్ ఖాళీ.!
కుప్పంలో సైకిల్ స్పీడ్‌‌కు ఫ్యాన్ ఖాళీ.!
ఇలా చేస్తే ఐదేళ్లలో మీరే లక్షాధికారి..పోస్టాఫీసు పథకంతో ఎంతో లాభం
ఇలా చేస్తే ఐదేళ్లలో మీరే లక్షాధికారి..పోస్టాఫీసు పథకంతో ఎంతో లాభం
90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా..
90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా..
ట్రంప్‌ ఎఫెక్ట్‌.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర
ట్రంప్‌ ఎఫెక్ట్‌.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటంటే..
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటంటే..
సూపర్ లుక్‌తో స్కోడా కైలాక్.. బుకింగ్‌లు షురూ..!
సూపర్ లుక్‌తో స్కోడా కైలాక్.. బుకింగ్‌లు షురూ..!
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..