Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 18, 2024): మేష రాశి వారు ఈ రోజు ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today:  వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 18th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 18, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 18, 2024): మేష రాశి వారు ఈ రోజు ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అనుకోకుండా అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యో గాల్లో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. దైవ చింతన వృద్ధి చెందుతుంది. అవసరమైనప్పుడు కొందరు మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మొండి బాకీలు కొద్ది ప్రయత్నంతో వసూలవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆస్తి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపారాల తీరును కొద్దిగా మార్చి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన అనుకూలతలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సోదరులతో ఆస్తి వివాదాలు చాలావరకు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలు నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వస్త్రాభరణాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు ఎటువంటి ఒత్తిడీ లేకుండా నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటా బయటా కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి,

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలని స్తాయి. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో పనిభారం, కొద్దిపాటి ఒత్తిడి తప్పకపోవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో జాగ్ర త్తగా ఉండడం మంచిది. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. చేపట్టిన పనులన్నీ సునా యాసంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఎక్కు వగా శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. బంధువుల వల్ల ఊహిం చని ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు. బంధుమిత్రులు కొందరు ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఉన్నత స్థాయి స్నేహాలు వృద్ధి చెందుతాయి. ఆక స్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. ఆస్తి వివాదం లేదా కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా పుంజుకుంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం ఆశించిన విధంగా, సాను కూలంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. సోదరు లతో స్థిరాస్తి వివాదాలు దాదాపు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజ నాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహం కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

సన్నిహితుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాటపట్టిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. బాధ్యతలపరంగా ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సరదాగా, హుషారుగా సాగిపో తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందుతారు. కొందరు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తి వివాదం నుంచి పూర్తిగా బయటపడతారు. కోర్టు కేసులు కూడా అనుకూలంగా పరిష్కారం అవు తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక సమ స్యలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. వృత్తి జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ప్రయా ణాల వల్ల లాభం కలుగుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. చేపట్టిన పనులన్నీ నిదా నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు