AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack Precautions : యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. కారణాలేంటో తెలిస్తే షాకవుతారు

ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఓ ఇంటర్ యువకుడు గుండెపోటుతో మరణించాడు. అలాగే ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న యువతికి గుండెపోటు రావడంతో తక్షణం స్పందించి వైద్య సాయం అందించడంతో ఆమె బతికింది. యువతలో గుండెపోటు ప్రమాదాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

Heart Attack Precautions : యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. కారణాలేంటో తెలిస్తే షాకవుతారు
Heart Attack
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 03, 2023 | 9:30 AM

Share

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్య అందరినీ వేధిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువతే గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఓ ఇంటర్ యువకుడు గుండెపోటుతో మరణించాడు. అలాగే ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న యువతికి గుండెపోటు రావడంతో తక్షణం స్పందించి వైద్య సాయం అందించడంతో ఆమె బతికింది. యువతలో గుండెపోటు ప్రమాదాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే కారణాలను గుర్తించి వాటి నుంచి రక్షణకు కొన్ని చర్యలు తీసుకుంటే గుండె పోటు ప్రమాదం నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో యువతలో ఆకస్మిక మరణాలకు కారణం పలు గుండె పనితీరు విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఈ వ్యాధి గురించి ఓ సారి తెలుసుకుందాం.

కరోనరీ ఆర్టరీ డిసీజ్

ఈ వ్యాధి  యువకుల్లో గుండెపోటుకు అత్యంత సాధారణ కారణంగా నిపుణులు చెబుతున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఇరుకుగా మారడం లేక నిరోధించడం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి

ఇది గుండె కండరాలు మందంగా మారడానికి కారణమయ్యే జన్యుపరమైన లోపం. ఇది శారీరక శ్రమ సమయంలో సక్రమంగా గుండె కొట్టుకోవడంతో పాటు గుండె నుంచి రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

హార్ట్ రిథమ్ డిజార్డర్స్

సాధారణంగా గుండె అస్థిరమైన లయలో కొట్టుకుంటే హార్ట్ రిథమ్ డిజార్డర్స్ అని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఉన్నవారికి స్పష్టమైన కారణం లేకుండా గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది.

ఛాతీ గాయం 

కాంటాక్ట్ స్పోర్ట్స్ గుండె కండరాలకు నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా హృదయ ధమనులను పని చేయడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ పరిస్థితి క్రమేపి గుండెపోటుకు దారితీస్తుంది.

ధమనుల్లో ఇబ్బందులు 

పుట్టుకతో వచ్చే గుండె లోపాలు నిర్మాణ, క్రియాత్మక సమస్యలకు కారణం అవుతాయి. దీని వల్ల గుండె రక్తాన్ని ప్రభావవంతంగా పంప్ చేయడం కష్టంగా మారుతుంది.

మాదక ద్రవ్యాలు

పొగాకు ఏదైనా రూపంలో లేదా మాదకద్రవ్యాల వాడకం గుండెపోటుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా కొకైన్ వంటి మందులు కరోనరీ వాసోస్పాస్మ్‌కు కారణమవుతాయి . గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల సంకుచితం చేస్తాయి. 

హార్ట్ ఎటాక్ లక్షణాలివే

యువకుల గుండెపోటు వస్తే రక్షణ కోసం ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు వస్తాయో? తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సకాలంలో స్పందిస్తే అకాల మరణం నంుచి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా యువతకు గుండెపోటు వస్తే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, వికారం లేదా వాంతులు అవ్వడం, తల తిరగడం, చేతులు, వీపు, మెడ లేదా దవడలో నొప్పి, అకారణంగా అలసట, చెమటలు పట్టడం వంటి లక్షణాలను గమనించవచ్చు.

నివారణ చర్యలు

గుండె జబ్బులున్న వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. అలాగే అలాంటి వారికి రెగ్యులర్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తే సకాలంలో సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా 20 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతి సంవత్సరం లేదా వారి వైద్యుడు సిఫార్సు చేసిన విధంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్న వ్యక్తులు తీవ్రమైన శారీరక శ్రమను నివారించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యువత ముఖ్యంగా ఆటలు ఆడే సమయంలో సేఫ్టీ గేర్ ధరించాలని పేర్కొంటున్నారు. 

నోట్: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించినది. ఆరోగ్యం విషయంలో నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..