Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 13 ఏళ్లకే ఆగిన గుండె.. హార్ట్‌ ఎటాక్‌తో 6వ తరగతి విద్యార్థిని హఠాన్మరణం.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

మరిపెడ మండలం బోడతాండకు చెందిన బోడ లకపతి, వసంత దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. వీరికి ఇద్దరు సంతానం. కూతురు బోడ స్రవంతి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శ్రీరామనవవి పండగ సందర్భంగా సెలవు కావడంతో...

Telangana: 13 ఏళ్లకే ఆగిన గుండె.. హార్ట్‌ ఎటాక్‌తో 6వ తరగతి విద్యార్థిని హఠాన్మరణం.. శోకసంద్రంలో తల్లిదండ్రులు
Representative Image
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2023 | 1:50 PM

13 ఏళ్లకే గుండె ఆగింది.. హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగే బాలికకు నూరేళ్లు నిండాయి..ముద్దులొలికే బాలిక అర్ధరాత్రి బాలిక గుండెపోటుతో మృతిచెందడంతో ఊరంతా విషాదం అలుముకుంది.. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసిగుండెకు ఎంత కష్టం వచ్చిందో.. 13 ఏళ్ల పసి హృదయం ఇగ నేను కొట్టుకొను అని ఆగిపోయింది.. సాయంత్రం వరకు తోటి మిత్రులతో సరదాగా ఆడి పాడిన బాలిక గుండె హఠాత్తుగా ఆగిపోయింది.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చివెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో శుక్రవారం తెల్లవారుజాము జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మరిపెడ మండలం బోడతాండకు చెందిన బోడ లకపతి, వసంత దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. వీరికి ఇద్దరు సంతానం. కూతురు బోడ స్రవంతి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శ్రీరామనవవి పండగ సందర్భంగా సెలవు కావడంతో గురువారం సాయంత్రం వరకు తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంది. అనంతరం నానమ్మ దగ్గర నిద్రించింది.

అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడింది స్రవంతి. ఆయాస పడుతూనే నానమ్మను లేపింది. ఆపై గుండెపోటుతో కుప్పకూలింది. సమీపంలోనే ఉన్న బాబాయ్‌ వచ్చి సీపీఎర్‌ చేశాడు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ బాలిక కన్నుమూసినట్లు వైద్యుడు చెప్పాడు. దీంతో స్రవంతి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముద్దులొలికే చిన్నారి హఠాత్తుగా చనిపోవడంపై స్థానికులను బాగా కలిచి వేసింది. తండోపతండాలుగా తరలివచ్చి బాలిక మృతదేహానికి నివాళి అర్పిస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..