AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin-D Deficiency : విటమిన్-డి లోపంతో ఆ సమస్యలు మరింత తీవ్రం.. ఈ ఆహారంతో సమస్య ఫసక్..

తాజా అధ్యయనాల ప్రకారం విటమిన్-డి లోపిస్తే మానసిక సమస్యలు కూడా వేధిస్తాయని వెల్లడైంది. విటమిన్-డి లోప వల్ల డిప్రెషన్, ప్రతికూల భావోద్వేగాలను మరింత పెంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ సమస్యతో ఏళ్ల తరబడి బాధపడుతున్న వారి రక్తంలో విటమిన్-డి లోపం ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.

Vitamin-D Deficiency : విటమిన్-డి లోపంతో ఆ సమస్యలు మరింత తీవ్రం.. ఈ ఆహారంతో సమస్య ఫసక్..
Vitamin D
Nikhil
| Edited By: |

Updated on: Apr 03, 2023 | 10:00 AM

Share

మానవ శరీర నిర్మాణంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే శారీరక ఎదుగుదల కనిపించాలంటే కచ్చితంగా ఎముకల ఎదుగుదల ఉండాలి. ఎముకల ఎదుగుదలకు విటమిన్-డి చాలా ముఖ్యం. అయితే ఇప్పటివరకూ విటమిన్-డి లోపం వల్ల ఎముకల సంబంధిత సమస్యలే వస్తాయని అనుకుంటే పొరపాటే. తాజా అధ్యయనాల ప్రకారం విటమిన్-డి లోపిస్తే మానసిక సమస్యలు కూడా వేధిస్తాయని వెల్లడైంది. విటమిన్-డి లోప వల్ల డిప్రెషన్, ప్రతికూల భావోద్వేగాలను మరింత పెంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ సమస్యతో ఏళ్ల తరబడి బాధపడుతున్న వారి రక్తంలో విటమిన్-డి లోపం ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే డిప్రెషన్ సమస్యతో బాధపడేవారు విటమిన్-డి సప్లిమెంట్‌ను వాడితే ఆ సమస్య నుంచి కొంతమేర బయటపడ్డారు. దీంతో పరిశోధకులు విటమిన్-డి లోపంతో ఉండేవారు మానసిక సమస్యలతో కూడా బాధపడతారని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత స్త్రీలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడతారని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు మాత్రమే కాదు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొంటున్నారు. 

విటమిన్-డి లోపం మెదడు పనితీరును రాజీ చేస్తుంది. అలాగే నిరాశ, చిరాకు, ఆందోళన వంటి లక్షణాలను పెంచుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న రోగుల్లో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఆ లోపం వల్ల అనారోగ్యానికి గురవ్వలేదనే విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. అయితే మానసిక సమస్యలకు విటమిన్-డి ప్రధాన కారణం కాకపోయినప్పటికీ, విటమిన్-డి సప్లిమెంట్‌ను వాడడం వల్ల రోగులకు డిప్రెషన్ స్థాయిలు తగ్గుతున్నాయి. దీంతో ఈ అంశాన్ని రుజువు చేసేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. సూర్యరశ్మిలోని ఈవీ కిరణాల వల్ల శరీరానికి అవసరమయ్యే విటమిన్-డి అందుతుందని అందరూ చెబుతూ ఉంటారు. విటమిన్ డి శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తుందని, తద్వారా మెదడు, నాడీ వ్యవస్థతో సహా వివిధ అవయవ వ్యవస్థల్లో విభిన్న పాత్రలను కలిగి ఉందని పలువురు వైద్యులు అభిప్రాయం పడుతున్నారు. విటమిన్-డి శరీరానికి అవసరమయ్యే పనులు చేసే హర్మోన్‌లాగా చూడాలని పలువు వైద్యులు చెబతున్నారు. జీవక్రియను మెరుగుపర్చడంతో పాటు హార్మోన్ల సమతుల్యతను కూడా విటమిన్-డి ప్రభావితం చేస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. 

ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వారు విటమిన్-డి లోపంతో బాధపడతారని పేర్కొంటున్నారు. విటమిన్-డి లోపం దరి చేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ కచ్చితంగా 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే విటమిన్-డి లోపం నుంచి బయటపడడానికి కొన్ని ఆహారాలను తరచూ తిన్నా మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చేపలు, గడ్డు, బలవర్థకమైన పాల ఉత్పత్తులను తరచూ తీసుకున్నా విటమిన్-డి లోపం నుంచి బయటపడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది వైద్యుల సిఫార్సు లేకుండా విటమిన్-డి సప్లిమెంట్స్‌ను తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.  

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా ఆరోగ్య పరమైన సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు