AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin Toxicity: కరోనా టైమ్ తర్వాత మళ్లీ విటమిన్ సప్లిమెంటరీ ఎడాపెడా వాడేస్తున్నారా? జాగ్రత్త.. ఈ విషయం తప్పక తెలుసుకోండి

వందేళ్లకు ముందు విటమిన్ల గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని వయస్సుల వారూ ఫుడ్ సప్లిమెంట్ల రూపంలో విటమిన్ మాత్రలను మింగుతున్నారు

Vitamin Toxicity: కరోనా టైమ్ తర్వాత మళ్లీ విటమిన్ సప్లిమెంటరీ ఎడాపెడా వాడేస్తున్నారా? జాగ్రత్త.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
Suplements
Madhavi
| Edited By: |

Updated on: Mar 12, 2023 | 10:28 AM

Share

కరోనా టైం తర్వాత మనలో ఆరోగ్య స్పృహ చాలా పెరిగింది. చాలా మంది తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు. అయితే కొందరు ఇమ్యునిటీ కోసం అతిగా విటమిన్ సంప్లిమెంటరీలను తీసుకుంటూ తమ ఆరోగ్యానికి నష్టం చేస్తున్నారు. కొత్త వైరస్ (హెచ్3ఎన్2) హడలెత్తిస్తున్న నేపథ్యంలో చాలా మంది మళ్లీ అతిగా విటమిన్లను వాడుతున్నారు. అయితే అవసరానికి మించి వీటిని వినియోగించడం సరికాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వందేళ్లకు ముందు విటమిన్ల గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని వయస్సుల వారూ ఫుడ్ సప్లిమెంట్ల రూపంలో విటమిన్ మాత్రలను మింగుతున్నారు. తమిళనాడులో ఒక అమ్మాయి విటమిన్ అధికంగా తీసుకోవడం వల్ల మరణించింది. ఆమె శరీరంలో విటమిన్ టాక్సిసిటీ ఏర్పడింది. ఆమె కాలేయం దెబ్బతింది. దీనిని హైపర్విటమినోసిస్ అని కూడా పిలుస్తారు, విటమిన్ టాక్సిసిటీ అనేది మీ శరీరంలో అధిక మొత్తంలో విటమిన్ ఉన్నప్పుడు సంభవించే చాలా అరుదైన ప్రాణాంతకమైన పరిస్థితి. ఇది సాధారణంగా ఎక్కువ మోతాదులో విటమిన్ సప్లిమెంట్ల తీసుకోవడం వల్ల వస్తుంది. ఆహారం లేదా సూర్యరశ్మి వల్ల కాదు. యాక్టివేటెడ్ చార్‌కోల్ సహాయంతో చికిత్స చేయగల పరిస్థితి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

విటమిన్ టాక్సిసిటీ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

దీనిని హైపర్విటమినోసిస్ అని కూడా పిలుస్తారు. విటమిన్ టాక్సిసిటీ అనేది చాలా అరుదు. అయినప్పటికీ విటమిన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇది ప్రాణాంతకంగా మారతుంది. ఇది సాధారణంగా ఎక్కువ మోతాదులో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల వస్తుంది. ఆహారం కానీ సూర్యరశ్మీ వల్ల కాదు…కేవలం సప్లిమెంట్లను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ప్రాణాలమీదకు వస్తుంది. విటమిన్ డి టాక్సిసిటీ యొక్క ప్రధాన పర్యవసానంగా మీ రక్తంలో కాల్షియం అధికంగా పేరుకుపోయి, వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జనకు కారణమయ్యే హైపర్‌కాల్సెమియా అని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి టాక్సిసిటీ ఎముకలు, మూత్రపిండాల సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఇది శరీర నొప్పిని కలిగిస్తుంది. కాల్షియం కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి కూడా కారణమవుతుంది.

నీరు vs కొవ్వులో కరిగే విటమిన్లు:

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 13 విటమిన్లు ఉన్నాయి, వీటిని రెండు వర్గాలుగా విభజించారు.

నీళ్ళలో కరిగిపోయే విటమిన్లు:

ఇవి శరీర కణజాలాలలో నిల్వ చేయబడవు. కాబట్టి, నీటిలో కరిగే విటమిన్లు ఎటువంటి హాని కలిగించవు.

నీటిలో కరిగే విటమిన్లు:

విటమిన్ B1 (థయామిన్)

విటమిన్ B2 (రిబోఫ్లావిన్)

విటమిన్ B3 (నియాసిన్)

విటమిన్ B5 (పాంతోతేనిక్ యాసిడ్)

విటమిన్ B6 (పిరిడాక్సిన్)

విటమిన్ B7 (బయోటిన్)

విటమిన్ B9 (ఫోలేట్)

విటమిన్ B12 (కోబాలమిన్)

కొవ్వులో కరిగే విటమిన్లు:

ఇవి నీటిలో కరగవు, శరీర కణజాలాలలో సులభంగా నిల్వ చేయబడతాయి, చివరికి విషాన్ని కలిగిస్తాయి.

కొవ్వులో కరిగే నాలుగు విటమిన్లు ఉన్నాయి:

విటమిన్ ఎ

విటమిన్ డి

విటమిన్ ఇ

విటమిన్ కె

విటమిన్ విషపూరితం యొక్క లక్షణాలు:

విటమిన్ టాక్సిసిటీ, వైద్యుల ప్రకారం, చర్మంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది, దీని వలన ఎర్రబడటం, చికాకు, పాచీ పొట్టు ఏర్పడుతుంది. దీర్ఘకాలిక, మితిమీరిన సప్లిమెంట్ వాడకం మరికొన్ని లక్షణాలకు దారితీయవచ్చు.

– పుర్రెలో ఒత్తిడి మార్పులు

– దృష్టి మార్పులు

– వికారం

– తలతిరగడం

– మైగ్రేన్లు

– ఎముక నొప్పి

– కాలేయం దెబ్బతింటుంది

– కోమా

– మరణం

అధిక విటమిన్లు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు:

విటమిన్లు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు: విటమిన్ ఎ విషపూరితం నుండి హైపర్విటమినోసిస్ వికారం, పెరిగిన ఇంట్రాక్రానియల్ ప్రెజర్, కోమా, మరణానికి దారితీస్తుంది. విటమిన్ డి సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వలన బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, క్రమరహిత హృదయ స్పందన వంటి ప్రమాదకరమైన లక్షణాలకు దారితీయవచ్చు. ఇది అవయవాలకు హాని కూడా కలిగిస్తుంది. అధిక-మోతాదు విటమిన్ ఇ సప్లిమెంట్లు రక్తం గడ్డకట్టడం రక్తస్రావం, స్ట్రోక్‌లకు దారితీస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..