Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adenovirus Cases: దేశంలో విస్తరిస్తోన్న అడినో వైరస్‌.. పిల్లలకు మరింత ప్రమాదకారి.. లక్షణాలు, నివారణ

వైరస్ వ్యాప్తి ప్రమాదకర పరిస్థితి కారణంగా, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులందరి సెలవులు నిరవధికంగా రద్దు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పీడియాట్రిక్ యూనిట్లతో పాటు ప్రత్యేక ఔట్ పేషెంట్ యూనిట్లను ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది.

Adenovirus Cases: దేశంలో విస్తరిస్తోన్న అడినో వైరస్‌.. పిల్లలకు మరింత ప్రమాదకారి..  లక్షణాలు, నివారణ
Adenovirus Cases
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2023 | 7:24 PM

దేశంలో అడినోవైరస్ సంక్రమణ గణనీయంగా పెరిగింది. దీంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా పరీక్షించిన స్వాబ్ నమూనాలలో, అడెనోవైరస్ సోకిన వారిలో 38 శాతం మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ (NICED) ఇటీవల ఈ విషయమై ఒక సర్వే నిర్వహించాయి. అందులో చాలా విషయాలు వెల్లడయ్యాయి. జనవరి 1 నుండి మార్చి 9 వరకు, దేశవ్యాప్తంగా వివిధ వైరల్ రీసెర్చ్ డయాగ్నొస్టిక్ లాబొరేటరీలలో 1708 నమూనాలను సర్వే చేశారు. ఈ సర్వేలో 650 శాంపిల్స్‌కు అడెనోవైరస్ సోకినట్లు గుర్తించినట్లు ఎన్‌ఐసిడి అధికారులు తెలిపారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ (NICED) వివిధ రాష్ట్రాల నుండి రోగుల నుండి నమూనాలను సేకరించాయి. అందులో షాకింగ్ సమాచారం వెల్లడైంది. పశ్చిమ బెంగాల్‌లో అడెనోవైరస్ బారిన పడిన రోగుల సంఖ్య అత్యధికంగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 650 నమూనాలలో, 38 శాతం సోకిన రోగులు ఉన్నటుగా గుర్తించారు. ఆ తర్వాత, తమిళనాడు రాష్ట్రంలో 19 శాతం మంది రోగులు వ్యాధి బారిన పడ్డారు. కేరళ రాష్ట్రంలో 13 శాతం మంది రోగులు కనుగొనగా, కేరళ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో కూడా 11 శాతం అడినోవైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ నాల్గవ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 5 శాతం మంది రోగులు ఉన్నారు. రోగులను గుర్తించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఐదవ స్థానంలో ఉంది.

అడినోవైరస్ కారణంగా అత్యధిక సంఖ్యలో బాధితులను పశ్చిమ బెంగాల్‌లో గుర్తించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అడినోవైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడెనోవైరస్ కారణంగా ఇప్పటివరకు 19 మంది మరణించారని, అందులో ఆరుగురు చిన్నారులు, అడినోవైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. ముప్పును ఎదుర్కోవడానికి ఫేస్ మాస్క్‌లను మళ్లీ ఉపయోగించడం ప్రారంభించాలని కోరారు. అడినోవైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత 12 రోజుల్లో 48 మంది చిన్నారులు మరణించారని కూడా పేర్కొన్నారు. గత 24 గంటల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం.

ఇవి కూడా చదవండి

అయితే, ప్రజలు కొందరు తెలిసి తెలియక అడినో వైరస్ భయాన్ని సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అడినోవైరస్ పౌరులను భయపెడుతుంది. మరోవైపు కొందరు వైద్యులు, మెడికల్‌ మాఫియా వ్యాపారం కూడా జోరుగా సాగిందన్నారు.

అడినోవైరస్ లక్షణాలు : అడినోవైరస్ ఒక అంటు వ్యాధి. దీని ఇన్ఫెక్షన్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అడినోవైరస్ సాధారణ లక్షణాలు ఫ్లూ లాంటి జలుబు, జ్వరం, శ్వాస ఆడకపోవడం, గొంతు నొప్పి, న్యుమోనియా. రెండేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ వైరస్ బారిన పడతారు. అడెనోవైరస్ చర్మం నుండి చర్మానికి సంపర్కం, దగ్గు, తుమ్ములు, సోకిన వ్యక్తి మలం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వైరస్ చికిత్సకు సరైన మందులు అందుబాటులో లేవు. నిర్దిష్ట చికిత్స ఏమీ లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అందువల్ల ఫ్లూ వంటి లక్షణాలతో ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శిశువైద్యులు, సహా వైద్యులకు ఆరోగ్య శాఖ సలహా జారీ చేసింది. వైరస్ వ్యాప్తి ప్రమాదకర పరిస్థితి కారణంగా, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులందరి సెలవులు నిరవధికంగా రద్దు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పీడియాట్రిక్ యూనిట్లతో పాటు ప్రత్యేక ఔట్ పేషెంట్ యూనిట్లను ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..