Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టవర్ ఎక్కి నిరసన చేపట్టిన మహిళ.. పోలీసు వేధింపులే కారణమంటూ ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తతం..

భారీగా గుమిగూడిన జనం రద్దీతో ఆ ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పోలీసులు-పరిపాలన, తహసీల్ అధికారుల హామీ మేరకు ఎట్టకేలకు మహిళ కిందకు దిగిపోయింది.

టవర్ ఎక్కి నిరసన చేపట్టిన మహిళ.. పోలీసు వేధింపులే కారణమంటూ ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తతం..
Buldhana Wife Climbed Tower
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2023 | 8:15 PM

ఖాకీల వేధింపులు భరించలేని ఓ ఇల్లాలు టవర్‌ ఎక్కి నిరసన చేపట్టింది. దాంతో స్థానికంగా తీవ్ర కలకలం మొదలైంది. ఆమెను కిందకు దింపేందుకు స్థానికులు శతవిధాలా ప్రయత్నించారు. భారీగా గుమిగూడిన జనం రద్దీతో ఆ ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళ టవర్ ఎక్కి నిరసన చేయటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

సమాచారం అందుకున్న పోలీసులు, తహసీల్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సదరు మహిళ తన సమస్యను అధికారులకు చెప్పుకుంది. తన భర్తపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారని, అది పూర్తిగా అవాస్తవమని మహిళ పేర్కొంది. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని మహిళ డిమాండ్‌ చేసింది.

పోలీసులు-పరిపాలన, తహసీల్ అధికారుల హామీ మేరకు ఎట్టకేలకు మహిళ కిందకు దిగిపోయింది. మహిళ దిగిన తర్వాత మెహకర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ