పనికావాలంటూ వచ్చే కొత్తవారితో తస్మాత్‌ జాగ్రత్త..! ఇళ్లను ఊడ్చేస్తున్న నేపాళీ గ్యాంగ్‌ అరెస్ట్‌..

అరెస్టు చేసిన వారి నుంచి 1 కిలో 173 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, 77.69 లక్షల నగదు, 1 లైసెన్స్ పిస్టల్, 3 లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

పనికావాలంటూ వచ్చే కొత్తవారితో తస్మాత్‌ జాగ్రత్త..! ఇళ్లను ఊడ్చేస్తున్న నేపాళీ గ్యాంగ్‌ అరెస్ట్‌..
Nepali Thieves 1
Follow us

|

Updated on: Mar 11, 2023 | 6:37 PM

పరిచయం లేని వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. పని నెపంతో వచ్చి తమకు ఆశ్రయం ఇచ్చిన వారి ఇళ్లలో లూటీలకు పాల్పడిన నేపాల్‌కు చెందిన ఒక గ్యాంగ్‌ను బెంగళూరు సౌత్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జేపీ నగర్, జయనగర్ స్టేషన్లకు సంబంధించి మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం 17 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని నేత్ర షాహి, లక్ష్మి సెజువల్, గోరక్ బహదూర్, భీమ్ బహదూర్, అంజలి, అబేష్ షాహి, ప్రశాంత్, ప్రకాష్, అర్జున్ షాయ్, పూరన్ షాయ్, హరీష్ షాయ్, రమితా ఠాకూర్, బికాస్, హేమంత్, సుస్మిత, రోషన్ పదం, ప్రేమ్‌లుగా గుర్తించారు. నేపాలీ దొంగలు పని కావాలంటూ వచ్చి ఇళ్లలో దోపిడీ చేస్తారంటూ పోలీసులు వెల్లడించారు.

ప్రేమ్, లక్ష్మి సెజువల్‌ను జె.పి.నగర్‌ 2వ లెవెల్‌లోని ఓ ఇంట్లో మూడు నెలల క్రితం కూలి పనికి కోసం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 28న ఇంటి యజమాని దంపతులు తిరుపతికి వెళ్లగా.. ఇంట్లో ఉన్న కుమారుడు కిరణ్‌కు తెలియకుండా అతనికి నిద్రమాత్రలు ఇచ్చారు. అనంతరం తన సహచరులు నేత్రా షాహీ, గోరక్ బహదూర్, భీమ్ బహదూర్, అంజలి, అబేష్ షాహి, ప్రశాంత్, ప్రకాష్‌లను అర్ధరాత్రి వారి ఇంటికి పిలిపించారు. అనంతరం ఇంట్లోని బంగారు నగలు, నగదు కాజేసి పరారయ్యారు.

ఇవి కూడా చదవండి
Nepali Thieves

కిరణ్ అర్థరాత్రి నిద్రలేచి తన ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించాడు. ఈ మేరకు జేపీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జె.పి.నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ జరిపి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారి నుంచి 1 కిలో 173 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, 77.69 లక్షల నగదు, 1 లైసెన్స్ పిస్టల్, 3 లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ..