Viral News: రబ్ నే బనా ది జోడీ..అంటే ఇదేనేమో..! 3 అడుగుల వరుడు.. మూడున్నర అడుగుల వధువుతో సప్తపది..
శ్యామ్ కుమార్ 7 మంది తోబుట్టువులలో పెద్దవాడు. కాగా, ఆరుగురు తోబుట్టువుల్లో రేణు చిన్నది. ఇప్పుడు ఈ అపూర్వ వివాహం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ అరుదైన, వింత వివాహం. బీహార్‌లోని సరన్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక అందరినీ ఆకట్టుకుంటోంది. మూడు అడుగుల వరుడు, మూడున్నర అడుగుల వధువు పెద్దల సమక్షంలో అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. గాఢదేవి ఆలయంలో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి సమక్షంలో ఇద్దరూ సప్తపది వేస్తూ.. జీవితాంతం ఒకరి ఒకరు తోడుంటామని హామీ ఇచ్చారు. పెళ్లి అనంతరం వధూవరులు కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వివాహానికి వధూవరుల కుటుంబసభ్యులతో పాటు వారి స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు హాజరయ్యారు. బీహార్‌లోని సరన్‌లో జరిగిన ఈ అపూర్వ వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బీహార్‌లోని చంచౌరాలోని రాంకోల్వా గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్యామ్ కుమార్ కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే. దీంతో అతనికి తగిన అమ్మాయి దొరక్క ఇంతకాల పెళ్లి చేసుకోలేకపోయాడు. అదే సమయంలో మధుర అనుమందర్‌లోని భావల్‌పూర్ నివాసి 20 ఏళ్ల రేణు ఎత్తు కూడా తక్కువే. ఆమె ఎత్తు మూడున్నర అడుగులు. ఎత్తు తక్కువగా ఉండడంతో రేణు కూడా సంబంధాలు కుదరక పెళ్లి చేసుకోలేదు. అయితే, వారిద్దరికీ దేవదూతలగా శైలేష్ సింగ్ అనే వ్యక్తి వచ్చాడు. తమ పిల్లలకు పెళ్లి కావడం లేదని ఇరు కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలుసుకున్న శైలేష్.. ఇరువురి కుటుంబాలను ఒకరికొకరు పరిచయం చేశాడు.
ఒకరినొకరు కలవడంతోనే ఇరు కుటుంబాల మధ్య అనుబంధం దృఢమైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గాఢదేవి ఆలయంలో ఇద్దరికీ పెళ్లి చేశారు.. ఈ పెళ్లితో ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. శ్యామ్ కుమార్ 7 మంది తోబుట్టువులలో పెద్దవాడు. కాగా, ఆరుగురు తోబుట్టువుల్లో రేణు చిన్నది. ఇప్పుడు ఈ అపూర్వ వివాహం యావత్ బీహార్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..