- Telugu News Photo Gallery Sydney woman changes jobs from flight attendant to become a truck driver Telugu News
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం వదిలేసిన అమ్మాయి ‘ట్రక్ డ్రైవర్’గా మారింది.. ఆమె గ్లామర్ ఫోటోలు చూస్తే యాక్సిడెంట్లు ఖాయం..!
ఆమె అందమైన మహిళ ఎయిర్ హోస్టెస్.. కానీ, ఇప్పుడామే తన ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలో చేరింది. ఆ కొత్త ఉద్యోగం నుండి పొందిన అనుభవాలను డాక్యుమెంట్ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో షేర్ చేయటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
Updated on: Mar 11, 2023 | 4:26 PM

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఒక మహిళ తన కొత్త ఉద్యోగంలో పొందిన అనుభవాలను డాక్యుమెంట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. బ్రీ ట్రక్కు నడిపి నాలుగేళ్లు దాటింది. ఆమె గతంలో వర్జిన్ ఆస్ట్రేలియాలో క్యాబిన్ క్రూ మెంబర్‌గా పనిచేసింది.

సిడ్నీకి చెందిన మహిళ బ్రీ టిక్‌టాక్‌తో బాగా ఫేమస్. ఆమెకు ఫాలోవర్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పైగా ఆమె ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడామె ఆ ఉద్యోగం మానేసి ట్రక్కు డ్రైవర్‌గా మారింది.

ట్రక్కు నడపడానికి లైసెన్స్ వచ్చినప్పుడు ఈ ఉద్యోగం మరిం ప్రేమ పెరిగిందని చెప్పింది బ్రీ. ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. వారానికి 70 గంటలు పని చేస్తుంది. ట్రక్ డ్రైవర్ బ్రీ సోషల్ మీడియాలో ట్రక్కు డ్రైవర్‌గా రోడ్డుపై తన జీవితాన్ని ప్రపంచానికి చూపిస్తూ కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.

బ్రీకి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో పురుషుల కంటే తానే ఎక్కువ ట్రైలర్‌లను లాగుతానని చెప్పింది. ఆ వీడియోని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. సిడ్నీ నగరంలో ట్రక్కు నడుపుతూ.. ట్రక్ డ్రైవర్‌గా ఆమె తన జీవితం ఎలా సాగుతుందో ప్రజలకు వీడియో ద్వారా వెల్లడించింది. టిక్‌టాక్‌లో ఆమె వీడియోను వేలాది మంది వీక్షించారు.

బ్రీ వీడియోపై వేలాది మంది వ్యాఖ్యానించారు. వారంతా బ్రీ చేస్తున్న పనిని కొనియాడుతున్నారు. కాగా మరికొందరు మాత్రం ఆమె ఇప్పటికీ ఎందుకు ఒంటరిగా ఎందుకు ఉందంటూ పలువురు ప్రశ్నించారు. మీ ఎలాంటి వరుడు కావాలంటూ మరికొందరు కామెంట్ చేశారు.
