- Telugu News Photo Gallery Wahing machine using tips: How to get detergent stains out of clothes Telugu News
Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఉతికిన బట్టలపై సర్ఫ్ మరకలు అలాగే ఉంటున్నాయా..? పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి..
మీకు కూడా ఇలాగే జరుగుతుందా..? అయితే, మీరు ఖచ్చితంగా బట్టలు ఉతకడంలో ఇలాంటి తప్పు చేస్తున్నారని అర్థం.
Updated on: Mar 11, 2023 | 3:10 PM

బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ ఉపయోగిస్తున్నారా..? వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికిన తర్వాత చాలాసార్లు వాటిపై తెల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. మీకు కూడా ఇలాగే జరుగుతుందా..? అయితే, మీరు ఖచ్చితంగా బట్టలు ఉతకడంలో ఇలాంటి తప్పు చేస్తున్నారని అర్థం. అదేంటో తెలుసుకుందాం.

వాషింగ్ మెషీన్ ఆటోమేటిక్ అయినా, సెమీ ఆటో అయినా వాటిని వాడడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇవి చాలామందికి తెలియదు. ఈ కారణంగా చాలా సార్లు వాషింగ్ మెషీన్‌లో బట్టలు చిరిగిపోతుంటాయి. రంగు మారుతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే బట్టలు సులభంగా శుభ్రంగా చేసుకోవచ్చు.

వాషింగ్ మెషీన్లో సర్ఫ్ వాడేవాళ్లు మరింత జాగ్రత్త వహించాలి. వీలైతే, చెంచాతో కొలిచి మీకు కావాల్సినంత సర్ఫ్ వేసుకోండి. మీరు అవసరమైన దానికంటే ఎక్కువ సర్ఫ్ వేస్తే.. అది బట్టలపైనే అంటుకుని అలాగే ఉండిపోతుంది.

బట్టలపై తెల్లటి మచ్చలు ఇప్పటికీ కనిపిస్తే మిషిన్‌లో బట్టలు వేసి రెండోసారి తిప్పండి. మిషీన్‌లో అవసరమైన దానికంటే ఎక్కువ బట్టలు వేయకూడదు. ఎందుకంటే, లోడ్ ఎక్కువైతే బట్టలు సరిగా శుభ్రంకావు. దీని కారణంగా బట్టలపై సర్ఫ్ అతుకుపోతుంది.

బట్టలపై నేరుగా సర్ఫ్ వేయకూడదు. ముందుగా మెషిన్‌లో నీళ్లు పోసి సర్ఫ్ వేసి కాసేపు అలాగే ఉంచి అందులో బట్టలు వేయాలి. అలా చేస్తే సర్ఫ్ నీటిలో కరిగిపోతుంది. ఆ తర్వాత బట్టలు వేసి వాష్‌చేసుకోండి.




