- Telugu News Photo Gallery PM Narendra Modi To Start 10 Lane Bangalore Mysore Express Way On March 12, Travel Time to reduce To 90 Minutes
వారికి గుడ్ న్యూస్.. ఇకపై ఆ రెండు నగరాల మధ్య ప్రయాణం 3 గంటలు కాదు.. కేవలం గంటన్నర!
సాధారణంగా బెంగళూరు టూ మైసూరు(155 కిమీ) మధ్య రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే..
Updated on: Mar 11, 2023 | 12:11 PM

సాధారణంగా బెంగళూరు టూ మైసూరు(155 కిమీ) మధ్య రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే.. 3 నుంచి 4 గంటల వరకు ప్రయాణ సమయం పడుతుంది.

అయితే ఇకపై ఆ ప్రయాణ భారం తగ్గుతోంది. ఈ రెండు నగరాల మధ్య పది వరసల జాతీయ రహదారిని నిర్మించింది కేంద్ర ప్రభుత్వం.

భారతమాల పరియోజన పధకంలో భాగంగా 118 కి.మీ(రెండు నగరాల శివార్ల మధ్య) ఈ మార్గంలో ఆరు వరసల ప్రధాన రహదారితో పాటు ఇరువైపులా నాలుగు వరుసల సర్వీసు రోడ్డులను నిర్మించింది.

సుమారు రూ. 8,478 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ రహదారి(275)ని నిర్మించింది. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12(ఆదివారం) దీన్ని ప్రారంభించనున్నారు.

ఈ జాతీయ రహదారి బెంగళూరు-మైసూరు నగరాల మధ్య 118 కి.మీ దూరాన్ని కేవలం గంటన్నరలో కవర్ చేయనుంది. దీంతో ఇకపై 3 గంటల ప్రయాణం.. కాస్తా 90 నిమిషాలకు తగ్గనుంది.

ఈ రహదారిపై అవసరమైతే హెలికాప్టర్లను సైతం దింపవచ్చునని అధికారులు తెలిపారు.

రహదారిలో 40 చిన్న వంతెనలు, అండర్ పాస్, ఓవర్ పాస్‌లు ఉండగా.. మధ్యలో వచ్చే నగరాలు, పట్టణాలకు వెళ్లేందుకు ఎగ్జిట్ మార్గాలు సైతం ఉన్నాయి.





























