Sania Mirza: ప్రధాని మోదీ ‘ప్రకటన’పై స్పందించిన సానియా.. దేశం కోసం చేతనైనంతా చేస్తా
దేశం తరఫున సానియా మిర్జా సాధించిన విజయాలకు ప్రతిగా ఆమెను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. మార్చి 9న ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై తాజాగా సానియా మీర్జా..
ఆరు రోజుల క్రితం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఫేర్‌వెల్ మ్యాచ్ సానియా మీర్జా ఆటకు శాశ్వతంగా రిటైర్‌మెంట్ తెలిపారు. అయితే ఆదివారం జరిగిన ఆ మ్యాచ్ చూసేందుకు పలువురు సెలబ్రిటీలు తరలివచ్చారు. ఆ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశం తరఫున సానియా మిర్జా సాధించిన విజయాలకు ప్రతిగా అభినందిస్తూ మార్చి 9న ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై తాజాగా సానియా మీర్జా స్పందించారు. ప్రధాని చేసిన ప్రకటనను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆమె ఏమని రాసుకొచ్చారంటే..
‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి నా కృతజ్ఞతలు. నా సామర్థ్యం మేరకు మన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు నేను ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తున్నాను. ఇంకా మన దేశం గర్వపడేలా నేను చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాను. మీ మద్దతుకు ధన్యవాదాలు’’.
I would like to thank you Honorable Prime Minister @narendramodi Ji for such kind and inspiring words .I have always taken great pride in representing our country to the best of my ability and will continue to do whatever I can to make India proud . Thank you for your support. pic.twitter.com/8q2kZ2LZEN
— Sania Mirza (@MirzaSania) March 11, 2023
కాగా, సానియా చివరి మ్యాచ్ ఎల్బీ స్టేడియం వేదికగా జరిగింది. అనంతరం టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా ఆ సమయంలో భావోద్వేగంతో కంటతడి పెట్టారు. మ్యాచ్ అనంతరం సానియా ఫేర్‌వెల్ ఈవెంట్.. నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగింది. ఫర్హా ఖాన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, తెలంగాణ మంత్రి కెటీ రామారావు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఇర్ఫాన్ పఠాన్, హుమా ఖురేషి, మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ దంపతులు, సైనా నెహ్వాల్, ఎఆర్ రెహమాన్, యువరాజ్ వంటి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.