AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఇద్దరు పిల్లల తల్లి.. 41 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పసిడి పతాకాన్ని అందుకున్న ప్రతిభ..

ఉత్తరాఖండ్‌కు చెందిన 41 ఏళ్ల ప్రతిభ థాపియాల్. ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రతిభ ప్రస్తుతం బాడీబిల్డింగ్‌లో జాతీయ ఛాంపియన్. కఠోర శ్రమ, అభిరుచి ఉంటే ఏ లక్ష్యాన్నైనా ఎప్పుడైనా సాధించవచ్చని  ప్రతిభ రుజువు చేసింది. 

Success Story: ఇద్దరు పిల్లల తల్లి.. 41 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పసిడి పతాకాన్ని అందుకున్న ప్రతిభ..
Pratibha Thapliyal
Surya Kala
|

Updated on: Mar 11, 2023 | 11:45 AM

Share

అవకాశం ఇచ్చి చూసి మగువ తాను ఏ విషయంలోనూ ఎందులోనూ తక్కువ కాను అని నిరూపించుకుంటుంది. మహిళ వంటింటి మహారాణి మాత్రమేకాదు.. అంబరాన్ని సైతం అందుకుంటుంది. తనలో దాగున్న సామర్ధ్యాన్ని, ప్రతిభలను ప్రదర్శిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా విన్యాసాలను చేస్తూ తనకంటూ ఓ గుర్తింపుని సొంతం చేసుకుంటుంది. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఉత్తరాఖండ్‌కు చెందిన 41 ఏళ్ల ప్రతిభ థాపియాల్. ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రతిభ ప్రస్తుతం బాడీబిల్డింగ్‌లో జాతీయ ఛాంపియన్. కఠోర శ్రమ, అభిరుచి ఉంటే ఏ లక్ష్యాన్నైనా ఎప్పుడైనా సాధించవచ్చని  ప్రతిభ రుజువు చేసింది.

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన 13వ జాతీయ సీనియర్ మహిళా బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌కు చెందిన ప్రతిభ బంగారు పతకం సాధించింది. అయితే  ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీలో మొదటి సారిగా పాల్గొన్న ప్రతిభ.. తనలోని ప్రతిభను ప్రదర్శించి పతాకాన్ని పట్టేసింది. అది కూడా పసిడి పతాకాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. తనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించుకుంది.

ఇద్దరు కొడుకుల తల్లి ప్రతిభ.

ఇవి కూడా చదవండి

ప్రతిభకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి 17 ఏళ్ళు.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.  15 ఏళ్ల రెండు కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు.    టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం.. ప్రతిభ 2018లో థైరాయిడ్ ప్రాబ్లెమ్ ఏర్పడింది. దీంతో డాక్టర్లు వ్యాయామం చేయమని చెప్పాడు. అప్పుడు ప్రతిభ  తన భర్తతో కలిసి జిమ్‌లో చేరింది. తన ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టింది. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. కొన్ని నెలల్లోనే దాదాపు 30 కేజీలు తగ్గింది.

ప్రతిభ 7 గంటల పాటు శిక్షణ:  గతేడాది సిక్కింలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీల్లో తొలిసారిగా ప్రతిభ పాల్గొంది.  అప్పుడు నాలుగో స్థానంలో నిలిచింది. అయితే అప్పటి వరకూ ప్రతిభకు బాడీ  బిల్డర్ ధరించే దుస్తులు ధరించే అలవాటు లేదు. దీంతో ఆ బట్టలు ధరించడం ఆమె ఇబ్బందిగా ఫీల్ అయింది. అంతేకాదు.. మొదటిసారి ఆమె ఆ బట్టలు ధరించినప్పుడు ఇరుగుపొరుగు వెక్కిరింతలకు గురైంది. అయితే ప్రతిభకు అన్నివిధాలా భర్త అండగా నిలిచాడు. తన భర్త సహకారంతో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ.. బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టింది. రోజూ దాదాపు ఏడూ గంటల పాటు జిమ్ లో వ్యాయామం చేస్తుంది. కఠినమైన ఆహార నియమాలను పాటిస్తుంది. తన కష్టానికి గుర్తింపుని పసిడి పతకంతో దక్కించుకుంది 41 ఏళ్ల ప్రతిభ.. అంతేకాదు.. ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు సిద్ధమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..