Health Tips: విటమిన్ బీ12 లోపిస్తే కలిగే సమస్యలివే.. అధిగమించడానికి ఈ 3 పదార్థాలు తింటే సరి..
శరీరానికి కావలసిన శక్తి ఉత్పత్తిలో కూడా విటమిన్ బి12 ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో ఉన్న సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. శరీరంలో ఎలాంటి పోషకాహార లోపం లేకపోతేనే ఆరోగ్య సమస్యలు మనకు దూరంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్స్‌లలో ఏది లోపించిన శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ విధంగా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో విటమిన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే శరీరానికి అవసరమైన, అత్యవసరమైన పోషకాలలో విటమిన్ బి12 కూడా ఒకటి. ఇది DNA సంశ్లేషణలో సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం. అంతేకాక శరీరానికి కావలసిన శక్తి ఉత్పత్తిలో కూడా ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, మెదడు ఆరోగ్యాన్ని కాపాడి దాని పనితీరును మెరుగుపరచడంలో కూడా దీని పాత్ర చాలా ప్రధానమైనది. ఇక మన శరీరంలో విటమిన్ బి12 తగినంత స్థాయిలో లేకపోతే శరీరంపై అనేక రకాలుగా దాని ప్రభావం కనిపిస్తుంది. ఈ క్రమంలో విటమిన్ బీ12 లోపం కారణంగా ఏయే సమస్యలు తలెత్తుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ బీ12 లోపం వల్ల కలిగే సమస్యలు:
అలసట: శరీరంలో విటమిన్ బి12 లోపించినప్పుడు శరీరమంతా ఆక్సిజన్ ప్రవహించే వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఆక్సిజన్ డెలివరీ కణాలకు సరిగ్గా కాకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గడంతో మెగాలోబ్లాస్టిక్ అనిమియా అనే సమస్య వస్తుంది. దీనివల్ల రక్తహీనతతో పాటు అలసట, తలనొప్పి, మూడు స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలు: విటమిన్ బి12ను కేవలం ఆహారం నుంచి మాత్రమే మన శరీరం పొందగలదు. పొట్టలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎంజైమ్‌లు, విటమిన్ బి12ను ఆహారం నుంచి విడదీయడంలో సహాయపడతాయి. విటమిన్ బి12 లోపిస్తే జీర్ణవ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. జీర్ణాశయంలో తగినంత ఆక్సిజన్ అందదు. ఇది అతిసారం, వికారం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, ఆకలి లేకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
నరాల సమస్యలు: విటమిన్ బి12 లోపం నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నాడీ వ్యవస్థ అంటే నరాల వ్యవస్థ.. ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన ముఖ్యమైన పోషకం విటమిన్ బి12. ఇది శరీరంలో లోపిస్తే శాశ్వత నాడీ సంబంధిత నష్టానికి దారితీస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది. నరాల సమస్యలు ఒక్కసారి వస్తే వాటిని తగ్గించడం చాలా కష్టం. అందుకే ఎలాంటి నరాలకు నష్టం లేకుండా విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చర్మం పసుపు రంగులోకి మారడం, గొంతు నాలుక ఎర్రబారడం, నోటి పూతలు రావడం, నడిచే విధానంలో మార్పులు రావడం, కళ్ళు సరిగా కనబడకపోవడం, చిరాకు, నిరాశ వంటివి కలుగుతాయి.
రక్తహీనత: విటమిన్ బి1 లోపిస్తే రక్తహీనత కలుగుతుంది. దీన్నే కోబాలమిన్ లోపం అంటారు. శరీరం ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తయారు చేయలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చర్మం రంగును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మం లేత పసుపు రంగులోకి మారతాయి.
నోటి సమస్యలు: నోటిలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నాలుక పై వాపు రావడం, మంటలాంటి భావన కలగడం జరుగుతుంది. నోట్లో జలదరింపు, ఏదైనా సూదిగా ఉండే వస్తువులు గుచ్చుకున్నట్టు అనిపించడం కూడా విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తాయి.
విటమిన్ బి12ను అధిగమించేందుకు తినవలసిన పదార్థాలు:
పాలు: పాలల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. రోజూ ఉదయం, రాత్రి పాలు తాగితే శరీరం ఎప్పుడూ బలంగా ఉంటుందని డాక్టర్లు అంటారు.
పెరుగు: పెరుగులో విటమిన్ బీ12తో పాటు విటమిన్ బీ2 కూడా పుష్కలంగా ఉంది. అలాగే సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషణ అందుతుంది. అయితే ఎప్పుడూ తక్కువ కొవ్వు ఉండే పెరుగు మాత్రం తీసుకోండి.
ఓట్ మీల్: ఓట్ మీల్‌ను టిఫిన్‌గా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణుల సలహా. ఇది తీసుకోవడం వల్ల మనం రోజంతా చురుగ్గా ఉండగలం. అలాగే ఇందులో విటమిన్ బీ12 ఉండటం వల్ల అలసటను దరి చేరనివ్వదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..