Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: విటమిన్ల లోపమే ఈ సమస్యలకు కారణం.. అధిగమించాలంటే తీసుకోవలసిన ఆహారాలివే..!

వయసుకు అనుగుణంగానే శరీరంలో కొన్ని విటమిన్ల లోపం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అలసట, బలహీనత, ఎముకల నొప్పి వంటి పలు లక్షణాలను

Health Tips: విటమిన్ల లోపమే ఈ సమస్యలకు కారణం.. అధిగమించాలంటే తీసుకోవలసిన ఆహారాలివే..!
Women Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 15, 2023 | 6:51 PM

పెరగుతున్న వయసుకు అనుగుణంగానే శరీరంలో కొన్ని విటమిన్ల లోపం ఏర్పడుతుంది. అయితే 40 ఏళ్లు దాటిన మహిళలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటారు. దీంతో వారు పదేపదే బలహీనంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే అలసట, బలహీనత, ఎముకల నొప్పి వంటి పలు లక్షణాలను కూడా ఎదుర్కొంటారు. శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు సరిపడా లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యల వచ్చి పడుతుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక నిర్ధిష్ట వయసు తర్వాత అంటే 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో హార్మోన్ల మార్పులు కూడా ప్రారంభమవుతాయి. ఈ వయస్సులో మహిళలు ఎన్నడూ లేనంత బలహీనంగా అయిపోతారు. ఈ  బలహీనత కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే శరీరంలో విటమిన్ల లోపం, ఇంకా పోషకాల లోపం ఏర్పడితే.. ఆరోగ్య సమస్యలు పెరగడం సర్వసాధారణ విషయం. మరి ఈ క్రమంలో శరీరంలో ఏయే విటమిన్లు, పోషకాలు లోపిస్తాయో.. వాటిని ఎలా పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఐరన్‌: శక్తికి భాండాగారం వంటిది ఇది. శరీరమంతా ఆక్సిజన్‌ ప్రసారానికి ఈ పోషకం అవసరం. రోగనిరోధకశక్తికి దన్నుగా ఉండి, కండరాల పనితీరును క్రమపరిచే ఐరన్‌ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, మాంసాహారం సరిపడా తీసుకుంటూ ఉండాలి.

బయోటిన్‌: చర్మం, వెంట్రుకలు, గోళ్ల ఆరోగ్యానికి ఈ పోషకం అవసరం. నాడుల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ, గుండె పనితీరు సక్రమంగా సాగాలన్నా, మెటబాలిజం సమర్ధంగా ఉండాలన్నా బయోటిన్‌ సమృద్ధిగా ఉండే గుడ్లు, చిక్కుళ్లు, నట్స్‌, సీడ్స్‌, చిలకడ దుంపలు, మష్రూమ్స్‌ తింటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

మెగ్నీషియం: గుండె ఆరోగ్యాన్ని మెగ్నీషియం మెరుగుపరచడంతో పాటు భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. స్త్రీల నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. కండరాల బలహీనతను తొలగిస్తుంది. కాబట్టి మెగ్నీషియంతో కూడిన అరటిపండ్లు, అవకాడొ, పాలకూర, గుమ్మడి విత్తనాలు, సబ్జా గింజలు, బాదం, జీడిపప్పు, సోయా తింటూ ఉండాలి.

విటమిన్ సీ: విటమిన్ సి లోపం వల్ల శరీరంలో గాయాలు మానడం కష్టమవుతుంది. ఏదైనా గాయం అయినప్పుడు గాయాలు త్వరగా మానవు. కొల్లాజెన్, జుట్టు, చర్మం, రక్త  ప్రసరణకి విటమిన్ సి కూడా అవసరం. విటమిన్ సి లోపాన్ని తీర్చడానికి నారింజ, నిమ్మ, ద్రాక్ష, కాలానుగుణ పండ్లు వంటి పండ్లు తింటే మంచిది. విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

విటమిన్ B12: విటమిన్ B12 లోపం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీనివల్ల అనేక సమస్యలు మొదలవుతాయి. పెరుగుతున్న వయస్సులో మహిళలు గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. తద్వారా రక్త ప్రసరణ బాగా కొనసాగుతుంది. B12 లోపాన్ని తీర్చడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

విటమిన్ D: విటమిన్ D లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. దీంతో శరీరంలోని కీళ్లలో నొప్పి మొదలవుతుంది. విటమిన్ డి లోపం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. 40 ఏళ్ల తర్వాత, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, అలాగే ప్రతిరోజూ సూర్యరశ్మిని తీసుకోవడం అవసరం. ఎందుకంటే సూర్యరశ్మిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం నెరవేరుతుంది. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, పాలు, పెరుగు, జున్ను, ఆకుపచ్చ కూరగాయలు వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. శరీరంలో కాల్షియం లేకపోయినా కూడా విటమిన్ డీ లోపం వల్ల కలిగే సమస్యలే ఎదురవుతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..