Summer Health Tips: ఎండలో తిరిగి ముఖం నల్లగా కమిలిపోయిందా? ఈ చిట్కాలతో చర్మ కాంతిని తిరిగిపొందండి..
ఎండాకాలంలో కారణంగా మన ముఖం చాలాసార్లు నల్లబడుతుంది. కొంత మందిలో ఎర్ర మచ్చలు వస్తుంటాయి. వీటిని మంగు మచ్చలు అని కూడా అంటారు.

ఎండాకాలంలో కారణంగా మన ముఖం చాలాసార్లు నల్లబడుతుంది. కొంత మందిలో ఎర్ర మచ్చలు వస్తుంటాయి. వీటిని మంగు మచ్చలు అని కూడా అంటారు. ఇది సాధారణంగా సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల జరుగుతుంది. అలెర్జీ వల్ల కూడా కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారుతుంది, దీనివల్ల కొంచెం చికాకు వస్తుంది. అయితే ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగితే, అప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే చాలా సార్లు పెద్ద వ్యాధులు చిన్న లక్షణాల నుండి మాత్రమే అభివృద్ధి చెందుతాయి, ప్రారంభంలో శ్రద్ధ చూపడం మంచిది.
మీ చర్మం ఎర్రబడే సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దీన్ని వదిలించుకోవడానికి కొన్ని సహజమైన మార్గాలు ఉన్నాయి. అలాంటి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వీటి సహాయంతో మీరు చర్మం ఎరుపును సులభంగా వదిలించుకోగలుగుతారు. అలాంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.
- కలబంద: కలబంద జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. ఇది అనేక చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గాయం నయం చేసే లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై ఉన్న ఎర్రటి మచ్చలను తగ్గించడంలో మీకు చాలా సహాయపడతాయి. మీరు చేయాల్సిందల్లా అలోవెరా జెల్‌ను ఎర్రటి మచ్చలపై రాసి రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం శుభ్రమైన నీటితో మీ ముఖాన్ని కడగాలి. అలా 21 రోజులు చేస్తే మీ సమస్య దాదాపు సమసి పోతుంది. .
- చల్లటి నీటితో అద్దుకోవాలి: ఐస్ ముక్కలను ఒక వస్త్రంలో చుట్టి ఎర్ర మచ్చలపై చల్లటి కంప్రెస్ చేసుకోవడం కూడా మీ సమస్యకు మంచి నివారణ అవుతుంది. చర్మం చల్లబరచడం వల్ల మీ చర్మంపై వాపు దద్దుర్లు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఎర్ర మచ్చల సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.
- గ్రీన్ టీ ఆకులను అప్లై చేయండి: గ్రీన్ టీలో క్యాటెచిన్స్ మూలకాలు ఉంటాయి, ఇవి యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు మీ ముఖం ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి. మీరు చేయాల్సిందల్లా దాని గ్రీన్ టీ ఆకుల పొడిని ఉడకబెట్టి, ఆ నీటిలో ఒక గుడ్డను ముంచి ముఖంలోని ఎరుపు మచ్చలు ఉన్న భాగాలపై అప్లై చేయాలి.
- కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది, ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయం చేస్తుంది, దీని కారణంగా చర్మం ఎరుపు సమస్య తలెత్తుతుంది. ఒక చెంచా గోరువెచ్చని కొబ్బరి నూనె ముఖం ప్రభావిత భాగాలపై అప్లై చేసి, ఒక గంట తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి.




మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..