AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Low Blood Sugar: మీ శరీరంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గినప్పుడు ఎలాంటి సంకేతాలు వస్తాయి..? ఇలా చేస్తే ఉపశమనం

మారుతున్న జీవనశైలి, సరికాని ఆహారం కారణంగా మధుమేహం తీవ్రమైన వ్యాధిగా మారుతోంది. ఎవరికైనా చక్కెర స్థాయి పెరిగితే, అతను ఆహారాన్ని నియంత్రించడం..

Low Blood Sugar: మీ శరీరంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గినప్పుడు ఎలాంటి సంకేతాలు వస్తాయి..? ఇలా చేస్తే ఉపశమనం
Blood Sugar
Subhash Goud
|

Updated on: Mar 14, 2023 | 8:00 AM

Share

మారుతున్న జీవనశైలి, సరికాని ఆహారం కారణంగా మధుమేహం తీవ్రమైన వ్యాధిగా మారుతోంది. ఎవరికైనా చక్కెర స్థాయి పెరిగితే, అతను ఆహారాన్ని నియంత్రించడం ద్వారా, ఔషధం లేదా ఇన్సులిన్ సహాయంతో దానిని నియంత్రించుకోవచ్చు. అయితే షుగర్ లెవెల్ ఎంత తీవ్రంగా పెరిగితే రక్తంలో అంత ప్రమాదకరమని తెలుసుకోండి. చక్కెర స్థాయి తగ్గడం అంత ప్రమాదకరమని మీకు తెలుసా.? తక్కువ రక్త చక్కెరను హైపోగ్లైసీమియా అంటారు. ఈ సమస్య ఎవరికైనా రావచ్చు.. అయితే దీని గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేసుకోండి. తక్కువ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి చిట్కాలను తెలుసుకుందాం.

తక్కువ షుగర్‌ లెవల్స్‌ లక్షణాలు

రక్తంలో షుగర్ లెవల్స్‌ తక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంది. వణుకు, కళ్లు తిరగడం, ఆకలి, గందరగోళం, చిరాకు, గుండె చప్పుడు పెరగడం కూడా తక్కువ షుగర్ లక్షణాలు. చర్మం పసుపు, చెమట, బలహీనత ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే మూర్ఛలు కూడా సంభవించవచ్చు. రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే సకాలంలో చికిత్స చేయకపోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

షుగర్‌ లెవల్‌ ఎందుకు తగ్గుతుంది:

తక్కువ రక్త చక్కెర స్థాయి అనేక కారణాల వల్ల కావచ్చు. మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల అధిక వినియోగం షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆహారం మానేస్తే లేదా తక్కువ ఆహారం తీసుకుంటే వారి బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తక్కువ రక్త చక్కెర స్థాయిని నియంత్రించడానికి చిట్కాలు:

1. డాక్టర్ సలహా మేరకు ప్రతిరోజు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి.

2. ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు అల్పాహారం తీసుకున్న తర్వాత బయలుదేరండి.

3. రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే స్నాక్స్ తినండి.

4. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే, అది పెంచడానికి స్వీట్లు, చాక్లెట్లు తినిపించవద్దు. పంచదార, బెల్లం, గ్లూకోజ్ పౌడర్ తీసుకోవాలి.

5. మీరు అరకప్పు పండ్ల జ్యూట్ తాగవచ్చు.

6. ORS ద్రావణాన్ని తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగంగా ఉంటుంది.

7. ఒక కప్పు పాలు తాగండి. మీరు ఒక చెంచా తేనెను కూడా తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి