Corona Virus: మానవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఓవైపు కరోనా మరోవైపు ఎన్3హెచ్2 విజృంభణ..కొత్తగా కోవిడ్ 700 కేసులు
మన దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఓ వైపు కోవిడ్ కేసులు గ త రెండు రోజులుగా నమోదవుతున్నాయి. మరోవైపు అంతకుముందు హెచ్3ఎన్2 వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

దేశంలో కరోనా వైరస్ భయం మరోసారి మొదలైంది. మారుతున్న వాతావరణం కారణంగా ప్రజలు దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్3హెచ్2 వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్ 19 పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. నాలుగు నెలల తర్వాత దేశంలో ఒక్కరోజులో 700కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 4,46,92,710కి చేరుకుంది. అదే సమయంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 4,623 కు పెరిగింది.
దేశంలో గత ఏడాది నవంబర్ 12 వతేదీన 734 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం ఎనిమిది గంటల వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. కర్ణాటకలో ఇన్ఫెక్షన్ కారణంగా ఒక రోగి మరణించిన తరువాత.. దేశంలో మరణించిన వారి సంఖ్య 5,30,790 కు చేరుకుంది. గణాంకాల ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 4,41,57,297 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 నుండి మరణాల రేటు 1.19 శాతం ఉండగా.. రోగుల రికవరీ జాతీయ రేటు 98.80 శాతం ఉంది.
ఇప్పటి వరకు 220.64 కోట్ల వ్యాక్సిన్ పంపిణీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 220.64 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. విశేషమేమిటంటే ఆగస్టు 7, 2020న, భారతదేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 20 లక్షలుండగా.. ఆగస్టు 23, 2020న 30 లక్షలు మరియు సెప్టెంబర్ 5, 2020 నాటికి 40 లక్షలకు పైగా చేరుకున్న సంగతి తెలిసిందే.




2021లో కరోనా బాధితుల సంఖ్య మూడు కోట్లు మొత్తం ఇన్ఫెక్షన్ కేసులు 16 సెప్టెంబర్ 2020న 50 లక్షలు, 28 సెప్టెంబర్ 2020న 60 లక్షలు, 11 అక్టోబర్ 2020న 70 లక్షలు, 29 అక్టోబర్ 2020న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు దాటాయి. 19 డిసెంబర్ 2020 నాటికి దేశంలో ఈ కేసులు కోటి దాటాయి. మే 4, 2021న, సోకిన వారి సంఖ్య రెండు కోట్లు దాటింది. జూన్ 23, 2021 నాటికి కరోనా బాధితుల సంఖ్య మూడు కోట్లు దాటింది. గతేడాది జనవరి 25న మొత్తం ఇన్ఫెక్షన్ కేసులు నాలుగు కోట్లు దాటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..