Menstruation: పీరియడ్స్ తర్వాత మీకూ ఇలా జరుగుతుందా? కంగారు పడకండి
White Discharge After Menstruation Explained: సాధారణంగా అమ్మాయిలకు 3 నుంచి 5 రోజులపాటు ప్రతి నెలా పీరియడ్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత రక్తస్రావం ఆగిపోతుంది. కానీ తెల్లటి ఉత్సర్గ (ల్యూకోరియా) వస్తుంది. ఇది ప్రతి ఒక్కరిలో కనిపించే సహజ ప్రక్రియ. ఎందుకంటే ఇది యోనిని శుభ్రం చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది..

అమ్మాయిల్లో పీరియడ్స్ సాధారణం. ఈ ప్రక్రియ ప్రతి నెలా జరుగుతుంది. ఇది ఒక నిర్దిష్ట వయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది. సాధారణంగా 3 నుంచి 5 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత రక్తస్రావం ఆగిపోతుంది. కానీ తెల్లటి ఉత్సర్గ (ల్యూకోరియా) వస్తుంది. ఇది ప్రతి ఒక్కరిలో కనిపించే సహజ ప్రక్రియ. ఎందుకంటే ఇది యోనిని శుభ్రం చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ కొంతమందిలో ఇది అధికంగా వెలువడుతుంది. మరికొందరిలో ఇది దుర్వాసన కూడా కలిగిస్తుంది. అటువంటి లక్షణం కనిపించినప్పుడు విస్మరించకూడదు. ఇవి ఒక రకమైన అసాధారణ లక్షణం. కాబట్టి పీరియడ్స్ తర్వాత తెల్లటి ఉత్సర్గ అధికంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నిజనానికి పీరియడ్స్ తర్వాత తెల్లటి ఉత్సర్గం ఒక రకమైన ఇన్ఫెక్షన్‌కు సంకేతం అని గైనకాలజిస్టులు అంటున్నారు. దీనిని నివారించడానికి మహిళలు ఎల్లప్పుడూ శుభ్రమైన లోదుస్తులను ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వంటి కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి. వీటన్నిటితో పాటు, కొన్ని ఇంటి నివారణలను కూడా ప్రయత్నించవచ్చు.
పీరియడ్స్ తర్వాత తెల్లటి ఉత్సర్గ ఎందుకు కనిపిస్తుంది?
సాధారణంగా పీరియడ్స్ తర్వాత, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వలన గర్భాశయంలో మరింత శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది తెల్లటి ఉత్సర్గ పెరుగుదలకు దారితీస్తుంది. అండోత్సర్గము సమీపిస్తున్న కొద్దీ ఉత్సర్గం మరింత పెరగవచ్చు. ఇది తెలుపు, క్రీము రంగులో ఉండవచ్చు. పీరియడ్స్ తర్వాత, అండం పరిపక్వం చెందడం ప్రారంభించినప్పుడు కొన్ని రోజుల పాటు తెల్లటి ఉత్సర్గ ఉండవచ్చు. కానీ పీరియడ్స్ తర్వాత తెల్లటి ఉత్సర్గం ఉండటం సాధారణమా కాదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అండోత్సర్గము సమయంలో పీరియడ్స్ ప్రారంభానికి ముందు తెల్లటి ఉత్సర్గం కనిపించడం ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. కానీ ఇది దురద, దుర్వాసన కలిగి ఉంటే విస్మరించకూడదు.
నివారణ ఎలా?
ప్రైవేట్ పార్ట్స్ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాటన్ లేదా మృదువైన బట్టలతో తయారు చేసిన లోదుస్తులను ధరించాలి. అంజీర్ పండ్లలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి కడుపు నొప్పి, తెల్లటి ఉత్సర్గ సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతి నెలా అంజీర్ పండ్లను తప్పకుండా తినాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి








