Cooking Oil: ప్రాణాలు తీస్తున్నాయ్.. ఏది పడితే అది కొనకండి.. కల్తీ వంట నూనెను ఎలా గుర్తించాలో తెలుసా..?
నూనె లేకుండా వంట చేయడం అసాధ్యం.. వంట నుంచి సలాడ్ డ్రెస్సింగ్ వరకు.. ఫ్రై నుంచి క్రిస్పీ ఆహారాల వరకు.. అన్నీ.. పామాయిల్, ఆవాలు, రిఫైండ్, ఆలివ్ వంటి అనేక రకాల నూనెలను ఉపయోగిస్తారు. అందరి వంటగదిలో కూడా ఈ నూనెలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే మార్కెట్‌లో కల్తీ నూనెల వ్యాపారం చాలా వేగంగా పెరుగుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో వంట నూనెపై దృష్టిసారించడం చాలా ముఖ్యం..

నూనె లేకుండా వంట చేయడం అసాధ్యం.. వంట నుంచి సలాడ్ డ్రెస్సింగ్ వరకు.. ఫ్రై నుంచి క్రిస్పీ ఆహారాల వరకు.. అన్నీ.. పామాయిల్, ఆవాలు, రిఫైండ్, ఆలివ్ వంటి అనేక రకాల నూనెలను ఉపయోగిస్తారు. అందరి వంటగదిలో కూడా ఈ నూనెలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే మార్కెట్‌లో కల్తీ నూనెల వ్యాపారం చాలా వేగంగా పెరుగుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో వంట నూనెపై దృష్టిసారించడం చాలా ముఖ్యం.. ప్రస్తుత కాలంలో మార్కెట్లో కొనుగోలు చేసే వంట నూనె నకిలీ అయ్యే అవకాశం గణనీయంగా పెరిగింది. ఇది మీ డబ్బును వృధా చేయడమే కాకుండా మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది.
వంట నూనె ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలి.. కానీ.. హానికలిగించేలా ఉండకూడదు.. అటువంటి పరిస్థితిలో, మీరు వంట కోసం సరైన, నిజమైన నూనెను ఎంచుకోవడం ముఖ్యం. చాలా డూప్లికేట్ నూనెలు మార్కెట్‌లో అమ్ముడవుతున్న తరుణంలో.. మంచి వంట నూనెను ఎలా పసిగట్టాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
వంట నూనెను ఎలా కల్తీ చేస్తారు..
వంట నూనె తరచుగా ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌తో కల్తీ అవుతుంది. ఇది భాస్వరం కలిగిన సేంద్రీయ సమ్మేళనం లేదా పురుగుమందు.. దీనివల్ల గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
కల్తీ వంట నూనెను ఎలా గుర్తించాలి..
ఫుడ్ సేఫ్టీ సంస్థ.. FSSAI (Food Safety and Standards Authority of India) చెప్పిన సూచనల ప్రకారం..
ఒక గిన్నెలో 2 ml నూనె తీసుకుని అందులో ఒక చెంచా పసుపు వెన్న (Yellow Butter) వేయండి. నూనె రంగు మారకపోతే, అది స్వచ్ఛమైనది. వినియోగానికి సురక్షితం.. కానీ ఆ రంగు ఎరుపు రంగులోకి మారితే, ఆ నూనె అపరిశుభ్రంగా ఉన్నట్లే.. అంటే కల్తీది అన్నమాట.. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
ఇంట్లో నూనె నాణ్యతను ఎలా తనిఖీ చేయాలి..
శుభ్రమైన గిన్నెలో కొద్దిగా నూనె పోసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. స్వచ్ఛమైన నూనె ఘనీభవిస్తుంది. అయితే కల్తీ నూనె ద్రవంగానే ఉంటుంది.. ఆలివ్ ఆయిల్ అయితే.. 30 నిమిషాల్లో ఘనీభవించడం ప్రారంభమవుతుంది.
తెల్ల కాగితంపై కొంచెం నూనె వేసి ఆరనివ్వాలి. స్వచ్ఛమైన నూనె ఎటువంటి జిడ్డు లేకుండా సమానమైన, పారదర్శక ప్రదేశాన్ని వదిలివేస్తుంది.
వాసన చూసి నూనె కల్తీ అయిందా..? లేదా అనేది కూడా పసిగట్టవచ్చు.. ఎందుకంటే స్వచ్ఛమైన నూనెలో సహజమైన వాసన ఉంటుంది. కల్తీ నూనెలో ఉండదు.
మీకు ఏదైనా నూనె చాలా తక్కువ ధరకు లభిస్తున్నట్లయితే, అది చౌకైన పదార్థాలతో తయారు చేయబడిందని స్పష్టంగా అర్థం.. అలాంటి వాటికి దూరంగా ఉండండి..
ఇంకా బ్రాండెడ్ వంటనూనెలో కల్తీ జరిగే అవకాశం ఉండదు.. కావున మంచి వాటిని చూసి, వాటి లేబుల్స్ ను పరిశీలించి కొనాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..